బెడిసికొట్టిన బేరం.. తన్నుకున్న స్వలింగసంపర్కులు

Update: 2020-09-11 08:51 GMT
ఆయన ప్రభుత్వ అధికారి కానీ స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు. స్వలింగ సంపర్కం తప్పుకాదని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పడంతో మరింత రెచ్చిపోయాడు. ఆ అధికారి తరుచూ తనతో గడిపే మగవాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఫేస్ ​బుక్ ​లోనో - వాట్సప్​ లోనో ఇతర యాప్ ​ల్లోనో తన లాంటి వాళ్లు దొరక్కపోతారా అని ఆశగా ఎదురుచూస్తుంటాడు. అవసరమైతే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. కానీ ఇటీవల జరిగిన ఓ ఘటన అతడిని సమాజంలో తలెత్తుకోకుండా చేసింది. ఆ ఘటన ఏమిటో కాస్త వివరంగా తెలుసుకుందాం..

వనస్థలిపురానికి నివాసంలో ఉండే సుబ్బారావు (పేరు మార్చాం) ప్రభుత్వ ఉద్యోగంలో ఓ స్థాయి అధికారి. కానీ కొంతకాలంగా స్వలింగసంపర్కానికి అలవాటు పడ్డాడు. కాగా ఇటీవల అతడికి గూగుల్​ చాట్ ​పోర్టల్ ​లో బాపూనగర్​ కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ కొంతకాలం పాటు చాట్​ చేసుకున్నారు. తనతో గడిపితే రూ. 5 వేలు ఇస్తానని ప్రభుత్వ అధికారి సదరు యువకుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకు ఆ యువకుడు కూడా ఒప్పుకొని అతడు ఉండే లోకేషన్​ పంపించాడు. గత మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆ అధికారి యువకుడు ఉంటున్న లోకేషన్ ​కు వచ్చాడు ప్రభుత్వ అధికారి. తనకు ఫోన్ ​చేసిన యువకుడు దివ్యాంగుడు అని గుర్తించిన ప్రభుత్వ అధికారి అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించాడు. కాగా డబ్బులు ఇవ్వాలంటూ సదరు యువకుడి పట్టుబట్టడంతో అక్కడ పెద్ద గొడవ చెలరేగింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై న్యూసెన్స్​ కేసు పెట్టారు. ఇద్దరినీ పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది.
Tags:    

Similar News