భోగి మంటలో ప్రభుత్వ జీవో ప్రతులు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి మూడు రోజుల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భోగి వేడుకల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ నిమగ్నమయ్యారు.
కృష్ణ జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవో ప్రతులను ఆయన భోగి మంటల్లో వేశారు.
సంక్రాంతి పండుగను రైతులకు సీఎం జగన్ లేకుండా చేశారని.. అందుకే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోలను భోగిమంటల్లో దహనం చేసినట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు.
పాదయాత్రలో ముద్దులు పెట్టిన సీఎం జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రైతుల కోసం తాను పోరాడుతుంటే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, దేవినేని ఉమ పాల్గొన్నారు.
సాధారణంగా భోగిమంటల్లో ఇంట్లోని పాత వస్తువులు, చెక్కలు, అవసరం లేనివి వేస్తుంటారు. చంద్రబాబు మాత్రం ప్రభుత్వ జీవోలను వేయడం చర్చనీయాంశమైంది.