మోడీతో పిచాయ్ భేటీ.. ఆ బాదుడుపై హామీ పొందారా?
కొన్ని భేటీలు ఉత్తి పుణ్యానికే జరగవు. ప్రతి భేటీ వెనుక లెక్కలు చాలానే ఉంటాయన్న వాదనను నమ్మాల్సిందే. తాజాగా ప్రధాని మోడీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. వర్చువల్ సమావేశం ముగిసిన తర్వాత కీలక ప్రకటన ఒకటి వెలువడింది. రానున్న ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్య కాలంలో భారత్ లో రూ.75వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.
మోడీతో భేటీ తర్వాత జరిగిన గూగుల్ ఫర్ ఇండియా వార్షిక సమావేశంలో సుందర్ పిచాయ్ఈ ప్రకటన చేశారు. ఈక్విటీ పెట్టుబడులు.. భాగస్వామ్యాలు.. మౌలిక వసతులు లాంటి వాటి ద్వారా పెట్టుబడులు సమకూరుస్తామని చెప్పుకొచ్చారు. భారత్ లోని చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో డిజిటలైజేషన్ అద్భుతంగా సాగిందన్న పిచాయ్.. 2.6 కోట్ల చిన్న.. మధ్యతరహా వ్యాపార సంస్థలను సెర్చ్.. మ్యాప్ లపై చూడొచ్చాన్నారు. వాటికి నెలకు 15 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు చెప్పారు.
దేశంలోని చిన్న పారిశ్రామికవేత్తలు డిజిటల్ చెల్లింపుల్ని స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ అవసరాలకు తగ్గట్లు కొత్త ఉత్పత్తులు.. డిజిటల్ సేవల్ని అందించటం.. డిజిటల్ పరివర్తన దిశగా వ్యాపార సంస్థలకు సాధికారిత సమకూర్చటం.. టెక్నాలజీతో పాటు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ను విద్య.. వైద్యం.. వ్యవసాయం లాంటి సామాజిక ప్రయోజనాల కోసం వినియోగిస్తామని చెప్పారు.
ఇంటర్నెట్ ధరను మరింత అందుబాటులోకి తీసుకురావటం.. వాయిస్ ఇన్ పుట్ ను మరింత మెరుగుపర్చటం.. భారతీయభాషలన్నింటిని కంప్యూటింగ్ వెసులుబాటు కల్పించటం లాంటివి అనేకం సాధించాల్సి ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 22 వేల పాఠశాలల్లో పదిలక్షల మంది ఉపాధ్యాయులకు ఈ ఏడాది చివరిలోగా శిక్షణ ఇవ్వటానికి సీబీఎస్ఈతో భాగస్వామ్యాన్ని కుద్చుకోవటంతో పాటు.. అల్పాదాయ వర్గాల వారి కోసం పదిలక్షల డాలర్ల మేర గూగుల .ఓఆర్జీ గ్రాంట్ ను ఇవ్వనున్నట్లు చెప్పారు. పిచాయ్ తో ఫలప్రదమైన చర్చలు సాగించినట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అన్ని బాగున్నాయి కానీ.. ఇటీవల గూగుల్ మీద విధించిన ఆరు శాతం పన్ను వ్యవహారంపై కూడా సమావేశంలో కానీ.. దాని ముందు కానీ తర్వాత కానీ చర్చ వచ్చిందా? అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. దీనిపై ఎలాంటి సమాచారం రావట్లేదు. భారత్ మీద ఇంత ప్రేమను గుగూల్ పంచటానికి కారణం ఏమై ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.