హెచ్1బీ ఉద్యోగులకు శుభవార్త
అమెరికా ప్రభుత్వం హెచ్1 బీ వీసాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసా ఉన్న ఉద్యోగులకు కనీసం లక్ష డాలర్ల జీతం ఉండాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 31న యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) రీసెర్చ్ అసిస్టెంట్స్ కు - పెద్ద సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న వారికి మినహా హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 30వ తేదీన అక్కడి కార్మికశాఖ హెచ్1బీ వీసా పొందేందుకు ఉండాల్సిన జీతం పరిమితిని భారీగా పెంచేసింది.
ఈ రెండు నిర్ణయాల మధ్య సంబంధాన్నిఅర్థం చేసుకున్న యాజమాన్యాలు వాటిలో మార్పులు చోటు చేసుకుంటాయని భావించాయి. లెవెల్-1 వేతనాల్లో రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్..RFEకి అవకాశం ఉంటాయని భావించాయి. అయితే తాజా నిర్ణయంతో సీనియర్ ఐటీ నిపుణులకు కనీసం లెవెల్ 2 జీతం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెచ్1బీ జాబ్ ఉద్యోగాల్లో లెవెల్ 2 జీతం అందుకునే వారిలో సాధారణంగా సాఫ్ట్ వేర్ డవలపర్ - అప్లికేషన్స్ (జావా - డాట్ నెట్ - ఇతర డవలపర్లు) ఉంటారు. వీరికి శాన్ ఫ్రాన్సిస్కోలో 102,669 డాలర్లు - జెర్సీలో 92,768 డాలర్లు వేతనం లభిస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా గతంలో హెచ్1బీ ఉద్యోగులకు 60వేల డాలర్ల కనీస వేతనానికి రోజులు చెల్లినట్లేనని చాలా యాజమాన్యాలు భావిస్తున్నాయి. మరోవైపు.. తాజా నిబంధనల మేరకు తమ వేతనాలు పెంచాలని హెచ్1బీ ఉద్యోగులు తమ యాజమాన్యాలను కోరుతున్నారు. ఏది ఏమైనా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు ఆనందం కలిగిస్తోంది. తాజా వేతన సవరణలు వచ్చే ఏడాది జూన్ 30వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత అప్పటి పరిస్థితి మేరకు మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.