గత ఐదేళ్లుగా రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు..ఎందుకంటే !

Update: 2020-08-27 08:10 GMT
సాధారణం గా కోర్టు మాటలని పెడ చెవిన పెట్టిన ప్రభుత్వం .. కోర్టు మాటలు లెక్క చేయని వ్యక్తులు అని మనం వింటూనే ఉంటాం. కానీ, తాజాగా కోర్టు విధించిన నిబంధనను గత  ఐదేళ్లు గా ఇద్దరు నిందితులు  క్రమం తప్పకుండా ఇప్పటికి పాటిస్తూనే ఉండటం వెలుగులోకి వచ్చింది. వారు రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం చేసి వస్తున్నారు. ఇంకెన్నాళ్లు అని వారు అడగ లేదు .. ఆ కేసుని పోలీసులు కూడా ముందుకి తీసుకుపోలేదు. ఆ ఇద్దరి పరిస్థితిని గమించిన  ఓ సామాజిక కార్యకర్తలు ఆ నిబంధనల్ని ఎత్తి వేయాలని కోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు.

పూర్తి వివరాలు చూస్తే ..  సేలం జగత్తు వనపట్టి లో 2015లో ఆక్రమణల తొలగింపు వివాదానికి దారి తీశాయి. రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్నట్టు, వాహనాలపై దాడులు చేసినట్టు మణి, పళని అనే ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆ తర్వాత వారిద్దరికీ  నిబంధనలతో కూడిన బెయిల్‌ ఇవ్వగా ..  అదే ఏడాది మే లో బెయిల్ పై  బయట కు  వచ్చాయి. అయితే బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు విధించిన నిబంధనను ఇద్దరు ఐదేళ్లుగా అనుసరిస్తున్నారు. ఆ కేసులో నుండి  విముక్తి కోసం ఆ ఇద్దరు కోర్టును ఆశ్రయించలేదు.  పోలీసులు కేసును ముందుకు తీసుకెళ్ల లేదు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లు గా కోర్టు నిబంధన ప్రకారం ..  ఆ ఇద్దరు పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కి వస్తుండడాన్ని విజయేంద్రన్‌ అనే వ్యక్తి గుర్తించారు. వారికి విముక్తి కల్పించడం కోసం కోర్టు లో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ హై కోర్టు బెంచ్‌ ముందు విచారణ కు వచ్చింది.  ఆ ఇద్దరు కోర్టు నిబంధనల్ని గత ఐదేళ్లు గా తూచా తప్పకుండా  అనుసరిస్తూ వస్తుండడం చూసి న్యాయ మూర్తి షాక్ ‌కు గురయ్యారు. వెంటనే ఇద్దరికి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 
Tags:    

Similar News