అమెరికాలో ఆగ్రహజ్వాలలు ...జార్జ్ పోస్ట్‌మార్టమ్ లో వెల్లడైన సంచలన నిజాలు !

Update: 2020-06-02 08:50 GMT
అమెరికాకు ఇప్పుడు మరో కొత్త సమస్య మొదలైంది. అట్లాంటా నుంచి లాస్ ఏంజిల్స్ వరకు కొత్త రగడ చుట్టేసింది.  నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీసు తొక్కి చంపిన ఘటనపై నిరసనలు అమెరికా అంతటా విస్తరిస్తున్నాయి. అమెరికాలో జరిగే అల్లర్లకు కారణమైన జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన మరణానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. దీనితో ఇప్పటివరకు అమెరికా పోలీసులు చెబుతోన్న విషయాలన్నీ కట్టుకథలే అని స్పష్టం అయింది.

మిన్నెసొటాకు చెందిన ఓ ఇండిపెండెంట్ అటాప్సీ సంస్థ జార్జ్ ఫ్లాయిడ్ మృతదేహానికి అటాప్సీ పరీక్షలను నిర్వహించింది. అనంతరం తన అటాప్సీ రిపోర్ట్‌ను వెల్లడించింది. జార్జ్ గొంతును నొక్కడం ద్వారా ఊపిరి ఆడకుండా చేయడం వల్లే జార్జ్ ఫ్లాయిడ్ మరణించినట్లు ఆ ప్రతినిధులు డాక్టర్ మైకెల్ బ్యాడెన్, డాక్టర్ అల్లెసియా విల్సన్ వెల్లడించారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల మృతి చెందినట్లు తెలిపారు. మిన్నియాపొలీస్ అధికారి డెరెక్..జార్జ్ ఫ్లాయిడ్‌ను రోడ్డు మీద పడేసిన మోకాలితో అదిమి పట్టి ఉంచినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
Read more!

అమెరికాలో నివసిస్తోన్న ఆఫ్రికన్ అమెరికన్లను ఆగ్రహానికి గురి చేశాయి. అతి క్రూరంగా అతణ్ని వల్ల ఊపిరి ఆడకుండా అతను మృతి చెందాడని ఆగ్రహిస్తున్నారు. ఇది అమెరికన్ల జాత్యహంకారానికి ఇది నిదర్శనమని ఆరోపిస్తూ కొద్దిరోజులుగా ఆఫ్రికన్ అమెరికన్లు ఆందోళనలను చేస్తున్నారు. తాజాగా ఈ ఆందోళనలు దేశ రాజధాని వాషింగ్టన్‌కు వ్యాపించాయి. నిరసనకారులు రెచ్చిపోతుండటంతో శాన్‌ ఫ్రాన్సిస్కో, అట్లాంటా, లూయి‌సవిల్లె, లాస్‌ ఏంజెలెస్‌, పోర్ట్‌ లాండ్‌, కొలంబియా తదితర 25 నగరాల్లో కర్ఫ్యూలు విధించారు.  కర్ఫ్యూను కూడా లెక్కచేయకుండా నిరసనకారులు విధ్వంసాన్ని కొనసాగిస్తుండడంతో.. మిన్నెసొటా, కాలిఫోర్నియా, జార్జియా, ఓహియో తదితర 11 రాష్ట్రాల్లో నేషనల్‌ గార్డ్‌ రంగంలోకి  దింపారు.
Tags:    

Similar News