గ్యాంగ్ రేప్ నిందితులకు.. బుల్లెట్ దిగింది!

Update: 2021-05-28 14:33 GMT
క‌ర్నాట‌క‌లో నిర్భ‌య త‌ర‌హా ఘ‌ట‌న చోటు చేసుకుంద‌నే వార్త‌లు.. గురువారం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. బంగ్లాదేశ్ కు యువ‌తిపై న‌లుగుదురు దుండ‌గులు అత్యాచారానికి పాల్ప‌డ‌గా.. ఇద్ద‌రు మ‌హిళ‌లు ఈ దురాగ‌తానికి స‌హ‌క‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ దారుణానికి ఒడిగ‌ట్టిన త‌ర్వాత ప్రైవేట్ పార్టులో బీర్ బాటిల్ తో ఉంచార‌ని, ఈ మొత్తాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు దుండ‌గులు.

బెంగ‌ళూరు న‌గ‌రంలోని రామ‌మూర్తి న‌గ‌ర్ స‌మీపంలో ఉన్న‌ అవుల‌హ‌ళ్లిలోని ఓ ఇంట్లో 22 సంవ‌త్స‌రాల యువ‌తిపై ఈ గ్యాంగ్ రేప్ జ‌రిగింది. సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. అరుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. వీరిలో బంగ్లాదేశ్ కు చెందిన సాగ‌ర్‌, మొహ‌మ్మ‌ద్ బాబా షేక్‌, రిదాయ్ బాబు, హైద‌రాబాద్ కు చెందిన హ‌కీల్ ఉన్నారు.

కాగా.. శుక్ర‌వారం కేసు విచార‌ణ‌లో భాగంగా నిందితుల‌ను చెన్న‌సంద్రంలోని క‌న‌క‌న‌గ‌ర వ‌ద్ద‌కు తీసుకెళ్లారు పోలీసులు. అయితే.. ఈ స‌మ‌యంలో పోలీసుల నుంచి త‌ప్పించుకునేందుకు నిందితులు తీవ్రంగా ప్ర‌య‌త్నించార‌ని తెలుస్తోంది. వారి నుంచి తుపాకులు సైతం లాక్కునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. సాధ్య‌ప‌డ‌క‌పోవ‌డంతో రాళ్లు రువ్వి ప‌రుగులు తీసిన‌ట్టు స‌మాచారం.

లొంగిపోవాల‌ని పోలీసులు కోరిన‌ప్ప‌టికీ నిందితులు వినిపించుకోక‌పోవ‌డంతో.. వారిపై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో సాగ‌ర్, రిదాయ్ కాళ్ల‌లో బుల్లెట్లు దిగాయి. వీరిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

కాగా.. బంగ్లాదేశ్ నుంచి యువ‌తుల‌ను అక్ర‌మంగా త‌ర‌లించి, బెంగ‌ళూరులో హైటెక్ వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ కు గురైన యువ‌తి కూడా ఇదేవిధంగా కిడ్నాప్ చేసి త‌ర‌లించిన‌ట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో.. ఈ వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న వారు ఎవ‌రు అనే కోణంలో ద‌ర్యాప్తు సాగిస్తున్నారు.
Tags:    

Similar News