కాంగ్రెస్ లో కోవర్టులా..?
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి - మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలలోను ఈ పరిస్థితి నెలకొంది. మహాకూటమి సీట్ల సర్దుబాటు పూర్తి అయిన తర్వాత ఒక్కొక్క అంశమే వెలుగులోకి వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో 20 మంది కోవర్టులను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆ విషయాలను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చేర వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత గజ్జెల కాంతం ఆరోపిస్తున్నారు. కె. చంద్రశేఖర రావు ఎత్తుగడలను సమర్దవంతంగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలుగా విడుదల చేసింది. అందులో 20 మందికి పైగా డమ్మీ అభ్యర్దులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎత్తులను చిత్తు చేస్తామని ఆయన ప్రకటించారు.
ముందస్తు ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు మహాకూటమి కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా తమ పార్టీలో కోవర్టులున్నారని ప్రకటించడం 20 మంది డమ్మీ అభ్యర్దులతో జాబితా ప్రకటించామని చెప్పడం కూడా ఈ వ్యూహంలో భాగమే అంటున్నారు. నిజానికి తెలంగాణ ఎన్నికలలో మహాకూటమికి అధికారాన్ని కైవసం చేసుకునే సత్తా లేదని, వ్యూహాలతో తికమక పెట్టాలనే ఉద్దేశ్యంతోనే తమ పార్టీ నాయకుల చేత ప్రకటనలు చేయిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్దుల రెండు జాబితాలలోను డమ్మీగా పెర్కొనే నాయకులు లేరు. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మలి జాబితాలోని పది మందిలో కూడా సిట్టింగ్‌లు - సీనియర్లేకే ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ 20 మంది డమ్మీ అభ్యర్దులను ప్రకటించిందని ఎలా చెప్తారంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ డమ్మీ అభ్యర్దుల ప్రస్తావన పార్టీలో పెరుగుతున్న అసమ్మతిని తగ్గించుకుందుకే అని వాదనలు వినిపిస్తున్నాయి.