• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇంకా నాలుగున్నరేళ్ళు...

ఇంకా నాలుగున్నరేళ్ళు చంద్రబాబు పరిస్థితి ఇంతేనా ?

By - Tupaki Desk
Update: 2019-12-02 08:10 GMT
కాయలున్న చెట్టుకే ..రాళ్ల దెబ్బలు అని పెద్దలు చెప్పినట్టు, పదవులున్న వారికే గౌరవం , మర్యాద ఇస్తారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఉన్నారు ..ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఒక్క సారి పరిశీలిస్తే అంతా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. అదే మరి అధికారం మహిమ. అధికారం చేతులో ఉంటే పిల్లి అయిన సింహం లా గర్జిస్తుంది..అదే అధికారం ఊడితే సింహం కూడా పిల్లలా ఒక మూలన ఉండాల్సిందే. అయినా ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా? ఈ వ్యవహారం మొత్తం మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించే .. పాపం ఆయనకి ఈ మధ్య ఏ మాత్రం కాలం కలిసి రావడం లేదు.మొన్న అమరావతి ..నిన్న కర్నూల్... ఏమైంది?  

తాజాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. టీడీపీ చరిత్రలో అంతటి ఘోర ఓటమిని చూసింది లేదు. దీనితో అధినేత చంద్రబాబు చాలా క్రుంగిపోయారు. ఆ తరువాత ఆయనకి షాకులు ఇస్తూ పలువురు టీడీపీ కీలకనేతలు వైసీపీ , బీజేపీలోకి జంప్ అయ్యారు. పార్టీ నిర్మాణం కోసం ఒకవైపు బాబు బలంగా ప్రయత్నాలు చేస్తుంటే ..మరోవైపు సొంత పార్టీ నేతలే షాకులిస్తుండటం తో బాబు అయోమయం లో పడిపోయారు.

ఈ సంగతి పక్కన పట్టి ..బాబు మళ్లీ ప్రజలని అయిన ఆకట్టుకుందాం అని ప్రజాబాట పడితే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ .. గత వారం అమరావతి పర్యటనకు బయలుదేరిన చంద్రబాబుకు ఆదిలోనే షాక్ తగిలింది.  రాజధాని ప్రాంతానికి అలా చేరుకున్నారో లేదో ఇలా నిరసన పర్యం మొదలైంది. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆయన ప్రయాణించిన బస్సుపై రాళ్ళు, చెప్పులు విసిరి గో బ్యాక్ బాబు  అంటూ నినాదాలు చేశారు. రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు మోసం చేసి . ఇప్పుడు  ఏ మొఖం పెట్టుకొని మళ్లీ ఇక్కడకి వస్తున్నారంటూ కొందరు రైతులు ఆరోపించారు.

ఇక ఏదేదో అనుకోకుండా జరిగిందిలే అనుకుంటే ..తాజాగా బాబుకి మరో పరాభవం ఎదురైంది. పార్టీని బలోపేతం చేయడానికి జిల్లా పర్యటన చేస్తున్న బాబు .తాజాగా కర్నూల్ జిల్లాకి వెళ్లారు. కర్నూలు పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు అక్కడ హైకోర్టు సాధన సమితికి సంబంధించిన జెఎసి నిరసనలతో స్వాగతం పలికింది. కర్నూలులో వినిపిస్తున్న హైకోర్టు డిమాండ్‌ను అస్సలు పట్టించుకోకుండా అమరావతిలోనే హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని జెఎసి ప్రతినిధులు  ఆరోపిస్తూ బాబు కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మొత్తంగా బాబుకి జిల్లాల పర్యటనలు చేదు అనుభవాన్ని మిగుల్చుతున్నాయి. పక్కా ప్లానో లేదా యాదృచ్ఛికమో కానీ.. చంద్రబాబుకు జిల్లాల పర్యటనలు మిగిలిస్తున్న చేదు అనుభవాలు అధికార పార్టీనేతలకి మాత్రం ఆనందాన్ని ఇస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ..ఇంకో నాలుగున్నరేళ్ళు చంద్రబాబు పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Tags:    
  • Chandra Babu Naidu 
  • Chandrababu situation 
  • Ex Ap Chief Minister 
  • Tupaki Updates 

Similar News

ఢిల్లీ వచ్చింది చాలు..పాక్ మంత్రికి భారత్ షాక్ !

2026-11-21 03:32 GMT

టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?

2026-11-21 03:31 GMT

కొనేదంతా బంగారం కాదు...బిగ్ అలర్ట్ !

2026-11-21 03:31 GMT

ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు జనసేనకే !

2026-11-21 03:30 GMT

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS