మాజీ క్రికెటర్స్ సంపాదన మామూలుగా లేదుగా.. ఏం చేసి సంపాదిస్తున్నారంటే!
ఏ దేశంలోనైనా క్రికెటర్స్, సినీ నటులు ఎంతో రాయల్‌గా బతుకుతారు. వాళ్ల జీవితం చాలా రిచ్‌గా గడిచిపోతుంది. రోజుకు లక్షల్లో ఖర్చుపెడతారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బసచేస్తారు. వాళ్ల జీవితమంతా నిజంగా స్వర్గతుల్యమే. అయితే ఒక్కసారి స్టార్డమ్ పోయిన హీరోకు, ఫామ్ కోల్పోయిన క్రికెటర్‌ను ఎవరూ పట్టించుకోరు. అయితే రిటైర్డ్ అయిన క్రికెటర్లు కూడా కొత్త దారులను వెతుక్కొని ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ఏ పనిచేయలేక, సరైన సంపాదన మార్గం దొరకక ఇబ్బందులు పడ్డ క్రికెటర్లూ ఉన్నారు. అయితే మాజీ క్రికెటర్లు కొంతమంది ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రెట్ లీ : ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బౌలర్. దాదాపు 690 వికెట్లు తీశారు. అయితే క్రికెట్ విరమించాక బ్రెట్‌లీ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. త్వరలోనే ఇండియన్ మూవీలో నటించబోతున్నాడు. ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ త్వరలో అన్ఇండియన్ పేరుతో ఓ సినిమా నిర్మించబోతోంది. ఈ చిత్రంలో బ్రెట్‌లీ నటించనున్నట్టు టాక్.
ఆండ్రూ ఫ్లింటాఫ్ : ఇంగ్లాండ్ చెందిన మాజీ క్రికెటర్ ఫ్లింటాప్ మొత్తం 400 వికెట్లు తీశాడు. నిజానికి అతడు ఆల్ రౌండర్. క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక కిక్ బాక్సింగ్ లో చేరాడు. అతను ఆడిన మొదటి మ్యాచ్ లొనే అమెరికా కు చెందిన రిచర్డ్ డాసన్ ను ఓడించి గొప్ప ఖ్యాతిని దక్కించుకున్నాడు.
అర్షద్ ఖాన్ : పాకిస్థాన్ కు చెందిన అర్షద్ ఖాన్ రైట్ హాండ్ బ్యాట్స్ మెన్. తరువాత జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం అర్షద్ పరస్థితి చాలా దారుణంగా ఉన్నది. అతడు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం సిడ్నీలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడంటే అతడి జీవితం ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
క్రిస్ హారిస్ : న్యూజిలాండ్ కు చెందిన హారిస్ మంచి ఆల్ రౌండర్ గా తన సేవలను అందించాడు. రిటైర్మెంట్ తరువాత హారిస్ ఒక ఆర్థోపెడిక్ కంపెనీ లో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. హారిస్ కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.
ఇమ్రాన్ ఖాన్ : పాకిస్థాన్ 1992 లో వరల్డ్ కప్ గెలవడంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ ఖాన్ కు చాలా విచిత్రంగా రాజకీయాలు కలిసివచ్చాయి. అందుకు కారణం అతడి వాక్చాతుర్యమే. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ ప్రధాని . ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ తో పాటు రాజకీయాల్లో రాణించాడు. బహుశా ఓ దేశ క్రీడాకారుడు ప్రధాని కావడం చాలా అరుదు.
ఓలంగా : జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ ఓలంగా… రిటైర్మెంట్ అయ్యాక ఓ రియాలిటీ షోకి సింగర్ గా వెళ్లి….ఆ షోలో విజేతగా నిలిచాడు.
సిద్దూ : గొప్ప బ్యాట్స్ మన్ గా పేరుగాంచిన సిద్దూ రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్ గా తర్వాత కామెడీ షోకి జడ్జ్ గా…అటు తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అక్కడా మాంచి గుర్తింపు సాధించి పలు పదవులు చేపట్టారు. ఓ దశలో సీఎం పదవికే పోటీ పడ్డారు.
అయితే ఎక్కువ మంది క్రికెటర్లు పిచ్ క్యూరేటర్స్ గా సపోర్టింగ్ స్టాఫ్ట్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ టీమ్స్ కి కోచ్ లుగా, ఎంపైర్స్, వ్యాఖ్యాతలు గా రాణిస్తున్నారు.