ఆర్మీ క్యాంటిన్లలో విదేశీ స్కాచ్ బ్యాన్!

Update: 2020-10-24 09:31 GMT
కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తున్న సమయంలో లాక్ డౌన్ ను కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర మైన ప్రభావం కనిపించింది. అలాంటి తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకర్ నినాదాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి చేసుకున్న వస్తువులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనడం మానేయాలని దేశంలోని 4000 ఆర్మీ క్యాంటీన్లకు ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీనితో ఇకపై ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ మద్యం అమ్మకాలు ఆగిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అక్టోబర్ 19న అంతర్గత ఉత్తర్వులు జారీ అయినట్టు సమాచారం.

న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కథనం ప్రకారం, ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రిచర్డ్, యూకే కంపెనీ డియాజియోకు చెందిన  స్కాచ్ లాంటి విదేశీ మద్యం అమ్మకాలను నిలిపివేయనుంది. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే  విదేశీ బ్రాండ్ల కోసం ఆర్డర్లను నిలిపివేసినట్టు సమాచారం. ఈ ఏడాది మే, జూలై నెలల్లో ఈ అంశంపై సైన్యం, వైమానిక, నావికాదళంతో చర్చల అనంతరం, దేశ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ ఏ వస్తువులపై నిషేధం విధించబోతుందో స్పష్టంగా తెలియదు.  కానీ , ఆ జాబితాలో మద్యం కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు డిఫెన్స్ స్టోర్లలో దిగుమతి చేసుకున్న మద్యం అమ్మకాలు వార్షిక అమ్మకాలలో కేవలం 17 మిలియన్ డాలర్లు మాత్రమేనని, ఈ బ్రాండ్లపై బ్యాన్ విధించినా కూడా కలిగే నష్టం ఏమీ లేదని, స్టాక్ చాలా తక్కువగానే ఉంటుందని సీనియర్ అధికారి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనుకునే ప్రభుత్వం ఆలోచనకు తాజా ఆర్డర్ ప్రతికూల సంకేతాన్ని పంపుతుందన్నారు.

కాగా దేశవ్యాప్తంగా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ దాదాపు 5,000 స్టోర్లను నిర్వహిస్తోంది.  వీటిద్వారా మద్యం సహా ఎలక్ట్రానిక్స్, ఇతర  నిత్యావసర వస్తువులను సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు రాయితీ ధరలకు విక్రయిస్తుంది. ప్రతి ఏడాది 1.1 కోట్ల కేసుల ఆల్కహాల్‌ ను క్యాంటీన్ల ద్వారా విక్రయిస్తోంది. ఇందులో సగం రమ్. 1- 1.2 లక్షల కేసుల ఇంపోర్టెడ్ ఆల్కహాల్ ఉంటుంది.
Tags:    

Similar News