• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నరసాపురం మీద...

నరసాపురం మీద దృష్టిపెట్టారా?

By - Tupaki Desk
Update: 2022-09-19 17:30 GMT
వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే పావులు కదుపుతున్నట్లున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం.

పోయిన ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీచేసిన పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పోయినసారి ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారో లేదో తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం నరసాపురం నుంచి పోటీకి రెడీ అవుతున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు.

నరసాపురం నియోజకవర్గంపై పవన్ దృష్టి పెట్టడానికి రెండు కారణాలున్నాయి. మొదటిదేమో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగానే ఉండటం. రెండోదేమిటంటే క్షత్రియుల ఓట్లు గణనీయంగా ఉండటం. ఈ రెండు సామాజిక వర్గాలు కలిస్తే గెలుపు ఖాయమని పవన్ అనుకుంటున్నారట. కాపుల ఓట్లు తనకు పడతాయని పవన్ ఆశించటంలో తప్పులేదు. కానీ క్షత్రియుల ఓట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారు.

ఎలాగంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును కలుపుకుంటే వస్తాయని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో రఘురాజు పోటీచేసి, తాను అసెంబ్లీకి పోటీచేస్తే ఇద్దరి గెలుపు ఖాయమని పవన్ అంచనాలు వేసుకుంటున్నారు. పవన్ ఈ అంచనాకు రావటానికి హేతువు ఏమిటో ఎవరికీ తెలీదు. వచ్చే ఎన్నికల్లో జనసేన పరిస్ధితిపై సర్వే చేయించారని అంటున్నారు. బహుశా కాపులు, క్షత్రియులు కలిస్తే పవన్  గెలుపు ఖాయమని సర్వేలో వచ్చిందేమో.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే రఘురాజు ఎంపీగా పవన్ అసెంబ్లీకి పోటీచేయాలని నిర్ణయించుకోవటం వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంది. కానీ జనాలతో ఓట్లేయించుకోవటం వీళ్ళచేతుల్లో లేదు.

వీళ్ళ కాంబినేషన్ను మెచ్చితేనే జనాలు వీళ్ళకి ఓట్లేస్తారని పవన్ మరచిపోయినట్లున్నారు. ఇదే సమయంలో అసలు జనసేన పోటీ చేసే విషయంలోనే బోలెడంత అయోమయం ఉంది. బీజేపీతోనే కలిసుంటుందా ? లేకపోతే టీడీపీతో చేతులు కలుపుతుందా లేకపోతే ఒంటరిగా పోటీచేస్తుందా అన్నదే సస్పెన్సుగా ఉండిపోయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • PawanKalyan 
  • APPolitics 
  • JanasenaParty 
  • APAssemblyElections 
  • YSRCPGovernment 
  • NarsapuramConstituency 
  • RaghuRama 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS