హైదరాబాద్ లో వ్యాపారి కిడ్నాప్.. దారుణహత్య
హైదరాబాద్ మహానగరంలో ఒక హత్య కొత్త కలకలాన్ని రేపింది. ఒక చేపల వ్యాపారి కిడ్నాప్ కు గురై.. ఆ పైన దారుణహత్యకు గురయ్యారు. ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం ఇప్పుడు విమర్శలకు తెర తీస్తే..దిశ ఉదంతం తర్వాత కూడా తమ వద్దకు వచ్చే ఫిర్యాదుల విషయంలో హైదరాబాద్ పోలీసులు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఫోన్ కాల్ రావటంతో బయటకు వెళ్లిన చేపల్ వ్యాపారి రమేశ్ (50) దారుణ హత్యకు గురయ్యారు.సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. హైదరాబాద్ లోని వికాస్ పురికి చెందిన రమేశ్ కు బోరబండ.. జవహర్ నగర్ లలో చేపల దుకాణాలు ఉన్నాయి. ఆయనకు భార్య.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నెల ఒకటిన ఆయన సెల్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాన్ని మాట్లాడిన ఆయన పని మీద బయటకు వెళుతున్నట్లు చెప్పారు. ఇదంతా నాలుగు రోజుల క్రితం జరిగింది.
అలా బయటకు వెళ్లిన రమేశ్.. తన సెల్ ఫోన్ ను మాత్రం ఇంట్లో వదిలేశారు. మరో ఫోన్ తీసుకొని వెళ్లారు. సాయంత్రానికి కూడా ఇంటికి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి ఇంట్లో రమేశ్ ఫోన్ కు ఆయన పెద్ద కోడలు అరుణ ఫోన్ కు ఒక ఫోన్ వచ్చింది. వాంతులు చేసుకుంటున్నాడని.. ఆయన్ను ఉదయమే ఇంటికి పంపుతామని చెప్పటంతో కంగారు పడ్డ ఆమె.. తన భర్తకు.. ఇతరులకు చెప్పి కంగారు పడింది. రమేశ్ వద్ద ఉన్న రెండు ఫోన్లకు కాల్ చేస్తే.. ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉంది.
ఇదిలా ఉంటే.. తర్వాతి రోజు అరుణ ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో రమేశ్ ను వదిలిపెట్టాలంటే రూ.90లక్షలు ఇవ్వాలని.. ఆ డబ్బును హన్మకొండకు తీసుకురావాలని ఉంది. ఆ ఫోన్ కు కాల్ చేస్తే ఫోన్ స్విచ్చాప్ చేసి ఉంది. దీంతో.. వారు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే.. వారి నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉందన్న ఆరోపణ వినిపిస్తోంది. అరుణ ఫోన్ కు వచ్చిన మెసేజ్ ఆధారంగా ఆ నెంబర్ ఏసెల్ టవర్ పరిసరాల్లో ఉందని గుర్తించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.
ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి జవహర్ నగర్ లో ఉంటున్న శివకుమార్ ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో జూబ్లీహిల్స్ పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూస్తే.. దివాన్ బెడ్ మీద కుళ్లిపోయి.. పురుగులు పట్టిన స్థితిలో రమేశ్ డెడ్ బాడీని గుర్తించారు. కాళ్లను బ్రౌన్ కలర్ టేపుతో కట్టేసి.. గొంతు నులిమి హత్య చేసి ఉంటారని.. కిడ్నాప్ చేసిన రోజే చంపేసి ఉంటారని భావిస్తున్నారు.
డెడ్ బాడీ ఉన్న ఇంటిని శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ నెల 2న అద్దెకు తీసుకొని ఉంటాడని భావిస్తున్నారు. తనతో పాటు తీసుకొచ్చిన మహిళను తన భార్యగా చెప్పి అద్దెకు తీసుకున్నట్లు యజమాని చెబుతున్నాడు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు రూ.90లక్షలు డిమాండ్ చేస్తే.. తాము రూ.30 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని.. అయితే రూ.60 లక్షలు సంగతేమిటని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. గదిలో మూడు నల్లటి కవర్లుదొరకగా.. అందులో ఏముందన్నది తేల్లేదు. పలుచిక్కుముడులతో ఉన్న ఈ హత్య సంచలనంగా మారటమే కాదు.. ఎందుకంత దారుణంగా హత్య చేశారన్న విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.