కరోనా బాధితులకి సేవలు అందిస్తున్న ఈశాన్య తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్
ఒకప్పుడు అయితే అన్నింటిలో పురుషుల హవానే కనిపించేది. కానీ , ఆ తరువాత రోజుల్లో అది పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం పురుషులకి తోడుగా మహిళలు కూడా అన్నింటిలో రాణిస్తున్నారు. ప్రతీ రంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు. తాజాగా పురుషులకి , స్త్రీలకి దీటుగా ట్రాన్స్ జెండర్లు కూడా అన్నీ రంగాల్లో ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడక్కడా వారు తమ ప్రతిభను చాటుతున్నారు. ఉన్నత చదువులు చదువుతూ తమ మీద ఈ సమాజంలో ఉన్న వివక్షతను, చిన్న చూపును రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ ట్రాన్స్ జెండర్ ఏకంగా వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ అయింది. మణిపూర్ కు చెందిన ఆ ట్రాన్స్ జెండర్ పేరు బియాన్సీ లైష్రమ్. ఇంఫాల్ లోని శిజా హాస్పిటల్స్ అండ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్‌లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా బ్రియాన్సీ పనిచేస్తోంది. ఆసుపత్రిలో నర్సులు, వైద్యుల నుంచి తనకు మంచి సపోర్టు ఉందని, సహోద్యోగులు అందరూ తనతో సన్నిహితంగా ఉంటున్నారని బియాన్సీ ఆనందం వ్యక్తం చేస్తోంది. మెడిసిన్ చదివే రోజుల్లో కూడా తాను ఎలాంటి అవమానాలు ఎదుర్కోలేదని.. ఎవరూ తనను ఎగతాళి చేయలేదని చెప్పింది. ఎప్పటికైనా డాక్టర్ కావాలన్నది తన చిన్ననాటి కోరిక అంటూ .. ఇందుకోసం ఎంత కష్టమైనా సహిస్తానని నిర్ణయించుకుని కష్టపడి నా కలను నేరవేర్చుకున్న అని బియాన్సీ ఆనందం వ్యక్తంచేసింది.