ట్రెండింగ్ లో "రోస్టర్ డేటింగ్".. అంటే ఏంటి? వర్కౌట్ అవుతుందా?
ఈ మధ్యకాలంలో కాలం మారుతున్న కొద్దీ యువతలో ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు ఎవరిని నిర్ణయిస్తే వారిని వివాహం చేసుకునేవారు.;
ఈ మధ్యకాలంలో కాలం మారుతున్న కొద్దీ యువతలో ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు ఎవరిని నిర్ణయిస్తే వారిని వివాహం చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో ప్రేమ వివాహాలు పుట్టుకొచ్చాయి.. ఇక ఆ తర్వాత సహజీవనం.. ఇలా కాలం మారుతున్న కొద్దీ పెళ్లి విషయంలో మార్పులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మనసులు కలవడమే కాకుండా అభిప్రాయాలు కూడా కలవాలనే నేపథ్యంలో నచ్చిన వారితో పెళ్లి కాకుండానే సహజీవనం చేసి నచ్చితే వివాహం చేసుకోవడం లేకపోతే బ్రేకప్ చెప్పుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇంకొంతమంది పెళ్లి చేసుకోకుండా పిల్లలకి జన్మనిచ్చి ఆ తర్వాత వారికి దూరమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వివాహం విషయంలో మరో టాపిక్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అదే రోస్టర్ డేటింగ్.
ఏంటీ రోస్టర్ డేటింగ్ అనుకుంటున్నారా? ముఖ్యంగా యువత ఈ రోస్టర్ డేటింగ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపించడానికి గల కారణం ఏమిటి? దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? అసలు ఈ రోస్టర్ డేటింగ్ ట్రెండింగ్ లోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఇలా పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రోస్టర్ డేటింగ్ అంటే ఒకే సమయంలో చాలామంది వ్యక్తులతో డేటింగ్ చేయడం.. అంటే నచ్చిన కొంతమందిని సెలెక్ట్ చేసుకుని.. వారితో తరచూ టచ్ లో ఉండడం, ఎవరికీ పర్టికులర్గా కమిట్మెంట్ ఇవ్వకుండా.. అందరితో సరదాగా చాట్ చేస్తూ లేదా మీట్ అవుతూ టైం స్పెండ్ చేయడం లాంటిది అన్నమాట. ముఖ్యంగా ఎవరితో సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్ళాలో తెలుసుకోలేనప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే వ్యక్తిని వెతుక్కోవడానికి ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇకపోతే ఈ ట్రెండ్ ఇప్పుడు అటు అమ్మాయిలకు ఇటు అబ్బాయిలకు పర్ఫెక్ట్ ఛాయిస్గా మారిపోయింది.
ఒకే వ్యక్తిని నమ్మి మోసపోవడం కంటే.. నచ్చిన కొంతమందితో కొంతకాలం ట్రావెల్ చేసి.. తమకు ఎవరైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారో తెలుసుకునేంత వరకు ఈ రోస్టర్ డేటింగ్ ట్రెండింగ్ ఫాలో అవ్వడం నిజంగా అద్భుతం అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ రోస్టర్ డేటింగ్ వల్ల కొన్ని అనర్ధాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక గ్రూపు మెయింటైన్ చేయడం అందులో స్నేహితులుగా కొనసాగడం ఒకింత మంచిదే. కానీ ఒకే వ్యక్తికి ఇద్దరిపై అభిప్రాయాలు ఒకేలా ఉండడం లేదా ఇద్దరు వ్యక్తులకు ఒకరే నచ్చడం లాంటివి జరిగితే భవిష్యత్తులో ఈ రిలేషన్ విషయంలో అనర్ధాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు అని కొంతమంది విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ కొత్త ట్రెండింగ్ పై యువత మొగ్గు చూపుతున్నప్పటికీ.. సరైన జాగ్రత్తలు తీసుకొని దీనిని ఫాలో అయితే ఇబ్బందులు తలెత్తవు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి యువత ఇష్టపడుతున్న ఈ రోస్టర్ డేటింగ్ విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తే మంచిదని సలహాలు కూడా ఇస్తున్నారు నిపుణులు.