కోర్టులోనే కాల్చేశారు

Update: 2015-12-23 09:41 GMT
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా.. తుపాకీ కాల్పులతో కోర్టు హాలు దద్దరిల్లటం పెను సంచలనంగా మారింది. ఢిల్లీలోని కర్కర్ డుమా కోర్టులో చోటు చేసుకున్న ఈ ఘటన భయోత్పాతానికి గురి చేసింది. ఈ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించగా.. మరోఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం పూర్తిగా వెల్లడి కాలేదు.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. చెన్నూ పెహల్వాన్ అనే క్రిమినల్ ను జైలు నుంచి ఈ రోజు (బుధవారం) కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడే మాటు వేసిన అతని ప్రత్యర్థులు (?) ముగ్గురు కోర్టు ఆవరణలోనే తుపాకీతో కాల్పులు జరిపారు. ఊహించని పరిణామంతో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఈ షాక్ నుంచి తేరుకున్న పోలీసులు రియాక్ట్ అయి.. నిందితుల కోసం గాలింపులు జరపగా.. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏది ఏమైనా దేశ రాజధానిలో పట్టపగలు.. కోర్టు హాలులోనే హత్యకు ప్లాన్ చేయటం న్యాయమూర్తుల్ని.. న్యాయవాదుల్ని షాక్ తినేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Tags:    

Similar News