సీఎం కేసీఆర్ పై విరుచుకుపడిన ఫైర్ బ్రాండ్.. షా భేటీ తర్వాత చలిజ్వరం?
అసలే ఫైర్ బ్రాండ్. అందులోకి మంచి కాక మీద ఉన్నారు. పాదయాత్ర చేస్తున్నా ఎలాంటి ప్రచారం లేక ఫస్ట్రేషన్ లో ఉన్న టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తాజాగా పరుష వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు. సంచలన వ్యాఖ్యలు చేయటమే కాదు.. సీఎం ఇజ్జత్ తీయటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించారు. తాజాగా పాదయాత్ర చేస్తున్న రేవంత్.. శనివారం నాటికి అమన్ గల్ కు చేరుకున్నారు.
మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాడినట్లు డ్రామాలు ఆడిందన్న రేవంత్.. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ భయపడిపోయారన్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత.. కేసీఆర్ కు చలిజ్వరం వచ్చి ఫాంహౌస్ నుంచి బయటకు రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మోడీ సర్కారు తీసుకొచ్చిన నల్ల చట్టాలతో బహుళ జాతి సంస్థలకు రైతులు బానిసలుగా మారనున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ అమెరికాలో చిన్న ఉద్యోగం చేసే వారని.. ఆయన తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని అనుభవిస్తున్నట్లు మండిపడ్డారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్..కేటీఆర్ లు చేసిందేమీ లేదన్నారు. ఆదానీ.. అంబానీల కోసమే నల్ల చట్టాల్ని తీసుకొచ్చినట్లుగా ఫైర్ అయ్యారు. కొత్త వ్యవసాయ చట్టాలతో కొనుగోలు కేంద్రాలు ఉండవని.. రైతులకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లే హక్కు కూడా లేకుండా చేశారన్నారు.
టీఆర్ఎస్.. బీజేపీ రెండు పార్టీల గద్దెలు కూలి.. దిమ్మలు పగలాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోమన్న ఆయన.. కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిపోయిందన్నారు. ఆయనకు.. ఆయన కుటుంబ సభ్యులకు త్వరలోనే తెలంగాణ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. తాజా వ్యాఖ్యలు పరుషంగా ఉన్నాయి. దీనికి గులాబీ నేతలు మరెలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.