వలసొచ్చిన..కలిసొచ్చిన వాళ్ల మధ్యపోటీ!
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ - మహాకూటమి నువ్వా.. నేనా.. అన్నట్లు పోటీపడుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మహాకూటమి పార్టీలకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. గతంలో కాంగ్రెస్ - వైసీపీ - టీడీపీ - సీపీఐ నుంచి గెలుపొందిన కొందరు అభ్యర్థులు టీఆర్ ఎస్ కండువా కప్పుకొని కారెక్కారు. ఈసారి జరిగే ఎన్నికల్లో వారు టీఆర్ ఎస్ నుంచి బరిలో నిలిచి వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఏపీతో సరిహద్దు కలిగినవి తెలంగాణలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. కిందటి సార్వత్రిక ఎన్నికల్లో ఇందులో మూడు మాత్రమే టీఆర్ ఎస్ గెలుపొందింది. మిగిలిన 12 స్థానాల్లో విపక్ష అభ్యర్థులు గెలుపొంది సత్తా చాటారు. కాగా పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాన్ని టీఆర్ ఎస్ గెలుపొంది సత్తా చాటింది.
ఖమ్మం జిల్లాలో టీఆర్ ఎస్ బలం పుంజుకుంది. టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వర్ రావు టీఆర్ ఎస్ లో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఖమ్మంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తూ టీఆర్ ఎస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. నల్లొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ఇక్కడ టీఆర్ ఎస్ సత్తా చాటాలని ఉవ్విళ్లురుతుంది. మహబూబ్ నగర్ - సూర్యపేట జిల్లాలో మహాకూటమి - టీఆర్ ఎస్ పోటాపోటీగా నిలుస్తున్నాయి.
కిందటిసారి విపక్ష పార్టీల నుంచి గెలుపొంది టీఆర్ ఎస్ లో చేరిన అభ్యర్థుల మీదనే టీఆర్ ఎస్ గంపెడాశలు పెట్టుకుంది. సరిహద్దు నియోజకవర్గాల్లో సెటిలర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వారికే గెలుపు అవకాశాలు ఉన్నాయనేది సుస్పష్టం. ఎవరు సరిహద్దుల్లో హీరోగా నిలుస్తారో ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..