స్కూలుపిల్లల ఘర్షణ...విద్యార్థి మృతి!

Update: 2015-09-02 10:32 GMT
కొన్నిరోజుల క్రితం పాతబస్తీ లో కొంతమంది యువకులు రోడ్డుపైపడి "ఫైటింగ్ ఆట" ఆడుకోవడం... ఆ ఆటలో ఒక యువకుడు మరణించడం జరిగిన సంగతి మరిచిపోకముందే.. తాజాగా మరో ఇద్దరు యువకులు ఘర్షణ పడ్డారు. ఘర్షణ అంటే... చిన్నగా కొట్టుకోవడమో, నెట్టుకోవడమో కాదు! ఏకంగా తీవ్రంగా గాయపడేలా.. ఈ గాయలతో ప్రాణం పోయేలా! తాజాగా హైదరాబాద్ లోని ఒక స్కూల్లో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది!

వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ అబిడ్స్ కింగ్ కోఠీ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మంగళవారం సాయంత్రం గొడవపడ్డారు. మాటా మాటా పెరిగింది.. చిన్న గొడవ కాస్త చినికి చినికి గాలివానగా మారింది. ఈ ఘర్షణలో ఒక విద్యార్థి సిద్ధిఖీ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలియడంతో హుటా హుటిన ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స జరుగుతుంది అంతా సవ్యంగా ఉంది అనుకున్న దశలో బుదవారం ఉదయం ఈ విద్యార్థి మరణించాడు. చనిపోయే స్థాయిలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు ఘర్షణ పడ్డ వార్త సిటీమొత్తం దావానంలా వ్యాపించింది. ఇంతజరిగినా కూడా పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో సిద్ధిఖీ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు!

లేతవయసులోనే పిల్లల మనసుల్లో ఈ స్థాయి ఆవేశకావేశాలు, ఘర్షణకు తెగబడే ఆలోచనలు రావడానికి తల్లితండ్రుల పెంపకలోపమే అధికశాతం కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పిల్లలకు ఎటువంటి మాటలు చెబుతున్నాం.. ఏ సినిమాలు చూపిస్తున్నా.. ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలపై ఎటువంటి అవగాహన కల్పిస్తున్నాం అనేవిషయాలు ప్రతీ రోజు తల్లితండ్రులు మననం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. విద్య మాత్రమే నేర్పే పాఠశాలలు ఉన్న ఈ రోజుల్లో బుద్దులు మాత్రం నేర్పాల్సిన బాధ్యత కచ్చితంగా తల్లితండ్రులదే!
Tags:    

Similar News