ఆ ఇద్దరు మహిళా పోలీసులకు ఇదేం పోయే కాలం? ఆయన్ను అలా కొట్టటమా?

Update: 2023-01-23 16:00 GMT
ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక పెద్ద వయస్కుడైన టీచర్ ను ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఇష్టారాజ్యంగా కొట్టేసిన ఉదంతం బిహార్ లో చోటు చేసుకుంది. ఇంగ్లిషు బోధించే ఆ పెద్ద వయస్కుడైన టీచర్ ను అకారణంగా దాడి చేసిన వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకూ ఆ పెద్ద వయస్కుడైన టీచర్ చేసిన తప్పేమిటో తెలిస్తే ముక్కున వేలేసుకోవటమే కాదు.. ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం ఖాయం. వాళ్లిద్దరికి ఇదేం పోయే కాలమని అనేయటం ఖాయం.

బిహార్ లోని కైమూర్ లో పెద్ద వయస్కుడైన ఇంగ్లిషు టీచర్ నావల్ కిషోర్ పాండే నివసిస్తుంటారు. ఆయన స్థానిక డీపీఎస్ స్కూల్లో పాఠాలు చెబుతుంటారు.

సైకిల్ మీద ఇంటికి వెళుతున్న ఆయన కారణంగా రోడ్డ మీద ట్రాఫిక్ నిలిచింది. ట్రాఫిక్ ను పట్టించుకోకుండా వెళుతున్న ఆయన కారణంగా ట్రాఫిక్ నిలిచింది. దీంతో.. ఆయన్ను ఆపే ప్రయత్నం చేశారు ఇద్దరు మహిళా పోలీసులు.

అయితే.. ఆయన వారిని పట్టించుకోలేదు. ఏ ధ్యాసలో ఉన్నారో కానీ హడావుడిగా సైకిల్ మీద వెళుతున్నాడు. దీంతో.. సదరు పెద్దాయన మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మహిళా కానిస్టేబుళ్లు ఇద్దరు.. ఆయన్ను ఆపేసి.. కొట్టటం మొదలు పెట్టారు. తనను ఎందుకు కొడుతున్నారో కూడా అర్థం కాని అయోమయంలో ఉండిపోయారు ఆ పెద్ద వయస్కుడు.

దీన్ని గమనించిన ఒక వ్యక్తి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సదరు మహిళా కానిస్టేబుళ్ల మీద చర్యలు తీసుకోవాలన్నడిమాండ్ వచ్చింది. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు.. ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను మూడు నెలల పాటు విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. చేసిన పాపానికి ఆ మాత్రం చేయాల్సిందే.     



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News