రైల్ రోకో .. రోడ్ల దిగ్బంధం..భారత్ బంద్ లో కేంద్రానికి వ్యతిరేఖంగా పోటెత్తిన రైతులు !
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిన్న దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో 'భారత్ బంద్' జరిగింది. అసలు ఈ భారత్ బంద్ ఎందుకు నిర్వహించారంటే .. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం బిల్లు-2020,ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు , నిత్యావసర వస్తువుల బిల్లు 2020 ఇటీవల ఉభయ సభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రపతి ఆమోదం పొందడమే తరువాయి, ఇవి చట్టరూపం దాల్చనున్నాయి. ఈ బిల్లులతో రైతులకి తిప్పలు తప్పవని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... రైతులకు ఎలాంటి నష్టం జరగదని కేంద్రం చెబుతోంది.విపక్షాలు దురుద్దేశ పూర్వకం గా రైతుల ను తప్పు దోవ పట్టిస్తున్నాయన్నారు. ఈ తరుణంలోనే కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకం గా దేశ వ్యాప్తంగా పలు విపక్షాలు ఈ భారత్ బంద్ కి పిలుపునిచ్చారు.
ఈ భారత్ బంద్ ప్రభావం పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించింది. మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్ తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ కు మంచి స్పందన లభించింది. వేల సంఖ్యలో రైతులు రోడ్లపైకి వచ్చి వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ , తక్షణమే ఆ బిల్లుల్ని వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పంజాబ్‌లో అధికార పార్టీ కాంగ్రెస్,విపక్ష పార్టీలు శిరోమణి అకాళీదల్,ఆమ్ ఆద్మీ పార్టీలు భారత్ బంద్ కు మద్దతునివ్వడంతో భారీ స్పందన లభించింది. పలు వ్యాపార సంఘాలు రైతులకి మద్దతుగా తమ షాప్స్ ను మూసేసారు. ఇక రైతులు రైల్వే పట్టాలపై బైఠాయించడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. రైల్ రోకోను సెప్టెంబర్ 29 వరకూ పొడగిస్తున్నట్లు కిసాన్ మజ్దూర్ సంఘర్షణ్ కమిటీ ప్రకటించింది.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్... దేశానికి రైతులే వెన్నెముక అని... కేంద్రం తాజా నిర్ణయం వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. కేంద్రం ఈ బిల్లులను వెనక్కి తీసుకునేంతవరకూ కలిసికట్టుగా పోరాడుదామని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా శిరోమణి అకాళీదల్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ట్రాక్టర్ మార్చ్ చేపట్టారు. హర్యానాలోనూ బంద్ కు భారీ స్పందన లభించింది. వేలాది మంది రైతులు కర్నాల్-మీరట్,రోహ్ తక్-జజ్జర్,ఢిల్లీ-హిసార్ రోడ్డు మార్గాలను దిగ్బంధించారు. ఈ క్రమంలో పలు చోట్ల రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
ఉత్తరప్రదేశ్-ఢిల్లీ బోర్డర్ ను దిగ్బంధించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మహారాష్ట్రలో ముంబై,థానే,జల్నా,నాందేడ్ తదితర ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బిహార్ లో ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ దాదాపు 50 ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. దక్షిణాది లో కర్ణాటక,తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో రైతు నిరసనలు జరిగాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో చాలామంది రైతులు రోడ్డెక్కి నిరసనల్లో పాల్గొన్నారు.