• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా కాటుకి బలైన ఫెమస్...

కరోనా కాటుకి బలైన ఫెమస్ ప్రొఫెసర్ .. ఎవరో తెలుసా ?

By - Tupaki Desk
Update: 2021-04-15 00:30 GMT
భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కరోనా వైరస్ తో  పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయో , ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయం కళ్లకు కట్టినట్లుగా తెలిపే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత కేసులు దేశంలో భారీగా పెరిగిపోతున్నాయి. అయితే , దానికి తగ్గట్టు  ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ కరోనా కాటుకి బలైపోతున్నారు. ఆర్థికంగా సంవృద్ధిగా ఉన్నవారు కూడా కరోనా దెబ్బకి కన్నుమూస్తున్నారు అంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ కు చెందిన ఇంద్రాణీ బెనర్జీ మరణించిన వైనం తెలిస్తే ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే.

ఈ ప్రొఫెసర్ ప్రొఫైల్ మామూలుగా ఉండదు. ఆమె బార్క్ లో ఫెలో  కాలిఫోర్నియా వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్. అలాంటి ఆమె గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో నానో సైన్సెస్ విభాగంలో డీన్ గా వ్యవహరిస్తుంటారు. అంత హై ప్రొఫైల్ ప్రొఫసర్  కరోనా పాజిటివ్ గా తేలింది. శ్వాస సమస్య తలెత్తటంతో ఆమెను తొలుత గాంధీ నగర్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రద్దీగా ఉండటం, బెడ్లు లేకపోవటంతో  ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు. అయితే, అక్క ఆక్సిజన్ కాన్సట్రేటర్, వెంటిలేటర్ లేదని చెప్పటంతో సొంత వాహనంలోనే అహ్మదాబాద్ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ ఆసుపత్రి వారు ఆమెను చేర్చుకోలేదు. దీనికి కారణం   ఆమెను అంబులెన్సులో తీసుకురాకపోవడమే. దీనితో  మళ్లీ గాంధీనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, కొద్దిసేపటికే ఆమె మరణించారు. అన్ని హంగులు ఉండి కూడా, వైద్యసాయానికి అవసరమైన సదుపాయాలు లేకపోవటంతో ఆమె కరోనా కాటుకి బలైపోయింది. ప్రధాని ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో , ఓ హై లెవెల్ ప్రొఫైల్ ఉండే వ్యక్తికే ట్రీట్మెంట్ అందక చనిపోయారు అంటే , ఇక సాధారణ జనాల పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు.
Tags:    
  • Corona Virus 
  • Covid19 
  • Second Wave 
  • Latest News 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS