అమెజాన్​లో ఫేక్​ రివ్యూలు... ఇదో పెద్దస్కామ్​..!

Update: 2021-02-18 01:30 GMT
ఇప్పుడంతా డిజిటల్​ యుగం. ప్రతి ఒక్కరూ  తమ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, బట్టలు, మొబైల్స్​ ఇలా అన్నీ ఆన్​లైన్​లోనే కొంటున్నారు. అయితే మనం ఏదైనా వస్తువును కొంటున్నామంటే కచ్చితంగా రివ్యూలు, రేటింగ్​ చూసి కొనుగోలు చేస్తాం. అయితే అమెజాన్​లో ఫేక్​రివ్యూలు వస్తున్నట్టు విచ్​ (Which?) అనే ఓ సంస్థ గుర్తించింది. ఇలా ఫేక్​ రివ్యూలు ఇవ్వడం ఓ పెద్ద స్కామ్​ అని ఈ సంస్థ ఆధారాలతో సహా వెల్లడించింది. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను భారీగా విక్రయించుకొనేందుకు ఇలా ఫేక్​ రివ్యూలను ఇప్పించుకుంటున్నారని సదరు సంస్థ ఆరోపించింది. ఇలా ఫేక్​రివ్యూలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయని విచ్​ సంస్థ వెల్లడించింది.

డబ్బులు తీసుకొని కొందరు ఫేక్​ రివ్యూలు ఇస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఓ పెద్ద టీమ్​ పనిచేస్తున్నట్టు టాక్​. చాలామంది ఒక ఫేక్​ రివ్యూ ఇచ్చేందుకు దాదాపు రూ. 500 (5పౌండ్లు) తీసుకుంటున్నట్టు సమాచారం.

ఈ ఫేక్​ రివ్యూలపై అమెజాన్​కు కూడా సమాచారం ఉంది. కొందరు కావాలనే తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు ఇలా చేస్తున్నారు. దీనిపై అమెజాన్​ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘నకిలీ రివ్యూలు మా దృష్టికి వేస్తే వెంటనే మేము వాటిని తొలగిస్తాం. ఇటువంటి రివ్యూలు ఇచ్చేవాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.

ఇలా చేయడం అమెజాన్​ నిబంధనలను ఉల్లంఘించడమే.

చాలా ఫేస్​బుక్​ గ్రూప్​లు ఇటువంటి ఫేక్​ రివ్యూలు ఇస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం సదరు కంపెనీ నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా సంపాదిస్తున్నట్టు సమాచారం. తమ ఉత్పత్తులు విపరీతంగా అమ్ముడు పోతుండటంతో కొన్ని కంపెనీలు వీళ్లను ఆశ్రయిస్తున్నారు.

ఏదీ ఫేక్​ ? ఏది రియల్​?

అమెజాన్​ లాంటి సంస్థల్లో ఎవరైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే కచ్చితంగా రివ్యూలు చూసే కొంటారు. అయితే ఇందులో ఫేక్​ ఏదో రియల్​ ఏదో తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాండెడ్​ వస్తువు కాకపోయినా.. ఏదైనా వస్తువుకు విపరీతంగా పాజిటివ్​ రివ్యూలు ఉంటే అది ఫేక్​ రివ్యూ అని గ్రహించాలని సూచిస్తున్నారు. ఐదారు, పది  రివ్యూలు ఒకే రకంగా ఉన్నా అవి ఫేక్​ రివ్యూ అని తెలుసుకొవాలని అంటున్నారు.
Tags:    

Similar News