డీలిమిటేష‌న్‌ ఎఫెక్ట్‌: ఏపీలో ఓట్లు రావాలంటే రాటు దేలాల్సిందే..!

నాయ‌కుల గెలుపు అనేది ఓట్ల ఆధారంగానే ఉంటుంది. ప్ర‌జాస్వామ్యంలో ఈ మాట‌కు తిరుగులేదు.;

Update: 2026-03-28 01:30 GMT

నాయ‌కుల గెలుపు అనేది ఓట్ల ఆధారంగానే ఉంటుంది. ప్ర‌జాస్వామ్యంలో ఈ మాట‌కు తిరుగులేదు. అ యితే.. ప‌రిస్థితులు అన్నీ ఒకేలా ఉండ‌వు. ప్ర‌స్తుతం మారుతున్న ప‌రిణామాలు.. కొత్త‌గా వ‌స్తున్న సెగ్మెం ట్ల‌ను ప‌రిశీలిస్తే... నాయ‌కులు రాటు దేలాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీల త‌ర‌ఫున నాయ‌కు లు నిల‌బ‌డుతున్నారు. పార్టీ అండ లేదా.. సామాజిక వ‌ర్గాల బ‌లంతోనో నెట్టుకువ‌స్తున్నారు. ఇది నాయ‌కుల‌కు వ‌రంగా మారింది.

అయితే.. ప్ర‌స్తుతం మారుతున్న ప‌రిస్థితులు నాయ‌కుల‌ను రాటు దేల్చేలా మార‌నున్నాయి. ప్ర‌స్తుతం ఒక్కొక్క అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 2.3 ల‌క్ష‌ల మందికి పైగా ఓట‌ర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ఇది అంత‌క‌న్నా ఎక్కువ‌గానే ఉంది. పైగా.. వివిధ సామాజిక వ‌ర్గాలు.. త‌ట‌స్థ ఓట‌ర్లు కూడా ఎక్కువ‌గా ఉంటారు. తద్వారా.. గెలుపు గుర్రం ఎక్క‌డంలో నాయ‌కులు రెండు కార‌ణాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వాటిపైక‌స‌ర‌త్తు చేసి.. విజ‌యం ద‌క్కించుకుంటున్నారు.

అంతేకాదు.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఎన్నిక‌ల ప్రక్రియ‌ను గ‌మ‌నిస్తే.. త‌ట‌స్థ ఓట‌రు వేయాలంటే.. వేస్తు న్నారు.. లేదంటే లేదు. నాయ‌కులపై పెద్ద‌గా ఇష్టం లేని వారు ఓటింగుకు దూరంగా ఉంటున్నారు. కానీ.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న జ‌రిగితే.. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి 2029లో ఓట‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతుంది. అంటే.. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం ఉన్న ఓట‌ర్ల సంఖ్య 2.3 నుంచి 2.5 ల‌క్ష‌లుగా ఉంటే.. రాబోయే రోజుల్లో ఇది 1.3 ల‌క్ష‌ల‌కు కుదింపు జ‌రుగుతుంది.

అంటే.. కొత్త‌, పాత నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా.. ఓట‌ర్ల సంఖ్య ల‌క్షా 30 వేల నుంచి ల‌క్షా 50 వేల మ‌ధ్య మాత్ర‌మే ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు 2024 ఎన్నిక‌ల్లో 4.13 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి 2.3 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు తేలారు. కానీ, వీరినే 263 నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌ర్దుబాటు చేస్తే.. 1.3 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే వ‌స్తారు. దీంతో ఓట‌ర్ల సంఖ్య త‌గ్గ‌డంతోపాటు.. నాయ‌కుల‌పై విశ్లేష‌ణ‌ల‌తోపాటు నిశిత‌మైన ప‌రిశీల‌న ఉంటుంది.

త‌ట‌స్థ ఓట‌ర్లు కూడా.. ఆలోచించుకునే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా.. నిజాయితీ, నిబ‌ద్ధత ఉన్న నాయ‌కుల‌కు మాత్ర‌మే ప‌ట్టం క‌ట్టే అవ‌కాశం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని నాయ‌కులు రాటు దేలాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావాలి. ఎప్పుడైతే.. ఓటు వేసేవారి సంఖ్య త‌గ్గుతుందో.. అప్పుడు ఆటోమేటిక్‌గా నాయ‌కుల‌కు బాధ్య‌త‌లు కూడా పెరుగుతాయి. సో.. దీనిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం నాయ‌కులు ఉంటుంది.

Tags:    

Similar News