దేశంలో సేవల ఎగుమతులు తగ్గాయి
కరోనా పుణ్యమా అని.. ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇందుకు భారత్ సైతం మినహాయింపు కాదు. లాక్ డౌన్ వేళ.. ఎగుమతులు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అనంతరం కొద్దికొద్దిగా పుంజుకున్నప్పటికి ఇప్పటికి పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా సేవల ఎగుమతులు తగ్గుముఖం పట్టినట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
సెప్టెంబరులో భారత సేవల ఎగుమతులు 1.4 శాతం తగ్గినట్లుగా ఆర్ బీఐ చెబుతోంది. సేవల ఎగుమతులు 2019 సెప్టెంబరులో 17.54 బిలియన్ డాలర్లుగా తేలింది. ఎగుమతులే కాదు.. సేవల దిగుమతుల్లోనూ కోత పడింది. సేవల దిగుమతులు 11.10 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఏప్రిల్.. సెప్టెంబరు మధ్య సేవల ఎగుమతులు 100.97 బిలియన్ డాలర్లుగా ఉంటే.. దిగుమతులు 58.98 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం.
సేవల ఎగుమతుల్లోనే కాదు.. ఇతర ఎగుమతుల్లోనూ క్షీణత షురూ కావటం ఆందోళన వ్యక్తమవుతోంది. సెప్టెంబరులో అంతో ఇంతో సానుకూలత వ్యక్తమైతే.. గత నెలలో మాత్రం 5.4శాతం క్షీణించింది. పెట్రోలియం ఉత్పత్తులు.. వజ్రాభరణాలు.. జీడిపప్పు.. లెదర్.. ఇంజనీరింగ్ వస్తువులు.. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతి తగ్గటం దీనికి కారణంగా చెబుతున్నారు.