'గ్రేటర్ సీమ' పై బాబు స్ట్రాటజీ.. తమ్ముళ్లకు అర్థం కాలేదా.. ?
గ్రేటర్ రాయలసీమ. ఇప్పుడు కూటమిలో ఎక్కువగా వినిపిస్తున్న నినాదం ఇదే. ఈ ప్రాంతంపై పట్టు కోసం.. సీఎం చంద్రబాబు పదే పదే పార్టీనాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.;
గ్రేటర్ రాయలసీమ. ఇప్పుడు కూటమిలో ఎక్కువగా వినిపిస్తున్న నినాదం ఇదే. ఈ ప్రాంతంపై పట్టు కోసం.. సీఎం చంద్రబాబు పదే పదే పార్టీనాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రేటర్ సీమలో సత్తా చాటాలని కూడా చెబుతున్నారు. దీనికి కారణం.. దాదాపు 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడమే. అంతేకాదు.. వీటిలో ఒకేపార్టీ పట్టకట్టేవి కొన్ని మాత్రమే ఉండడం. ఎక్కువగా స్వింగ్ ఓటర్లు.. రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం.
ఇది సమగ్ర స్వరూపం..
+ అనంతపురం- శ్రీ సత్యసాయి (14 సీట్లు): అనంతపురం అర్బన్, ధర్మవరం, గుంతకల్, హిందూపురం, కళ్యాణదుర్గం, కదిరి, మడకశిర, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ.
+ కడప -అన్నమయ్య (10 సీట్లు): బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, కోడూరు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటి.
+ కర్నూలు - నంద్యాల (14 సీట్లు): ఆదోని, ఆళ్లగడ్డ, ఆలూరు, బనగానపల్లె, డోన్, కోడుమూరు, కర్నూలు, మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, పత్తికొండ, శ్రీశైలం, ఎమ్మిగనూరు.
+ చిత్తూరు - తిరుపతి (14 సీట్లు): చంద్రగిరి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, కుప్పం, మదనపల్లె, నగరి, పలమనేరు, పీలేరు, పుంగనూరు, పూతలపట్టు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లె, తిరుపతి.
వీటిలో తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ, ఆళ్లగడ్డ, పత్తికొండ, శ్రీశైలం, కుప్పం, హిందూపురం వంటి కొన్ని నియోజకవర్గాలు మాత్రమే టీడీపీకి కలిసి వస్తున్న నియోజకవర్గాలు. అంటే.. ఎంత బలమైన పోటీ ఉన్నా.. ఇక్కడ కొంతమేరకు గెలుపు గుర్రం ఎక్కొచ్చు. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితులు.. ఎన్నికలకు ముందున్న హవా వంటి ప్రభావితం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఇక్కడి నాయకులకు పదే పదే ..నియోజకవర్గాల్లో బలపడాలని చెబుతున్నారు. గ్రేటర్ సీమలో గత ఎన్నికల్లో కూటమి హవా కనిపించింది. పులివెందుల, పుంగనూరు, బద్వేల్ వంటి కేవలం వేళ్లపై లెక్కించే స్థాయిలోనే వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే.. కూటమికి దక్కిన మెజారిటీ సీట్లు శాశ్వతమా? అనేదే ప్రశ్న.
కానీ.. పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటిపై సీరియస్‌గా ఉండాలని చెబుతున్నారు. పైగా గ్రేటర్ సీమలో విజయం దక్కించుకుంటే.. అధికారంలోకి వచ్చేందుకు రెడ్ కార్పెట్ పడుతుందన్నది కూడా తెలిసిందే. మరి బాబు మాటలు ఎంత మంది అమలు చేస్తారన్నది చూడాలి. ప్రస్తుతం అయితే.. వినీ విననట్టే ఉన్నారన్నది రాజకీయ వర్గాలు చెబుతున్నమాట.