టీ20 కెప్టెన్: విరాట్ కోహ్లీ వారసుడు ఎవరు?
ప్రపంచ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించినప్పటి నుంచి తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారన్న దానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే మెజార్టీ వర్గాలు , విరాట్ కోహ్లీ సైతం తదుపరి కెప్టెన్ ‘రోహిత్ శర్మ’ అని భావిస్తున్నాడు. ఎందుకంటే టీ20ల్లో రోహిత్ కు మంచి రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్ ను అతడు ఐదుసార్లు చాంపియన్ గా నిలిపాడు.
కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకే టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ యువ కోణంలో చూస్తే మాత్రం రోహిత్ తోపాటు ఆ సత్తా మరో ముగ్గురు యువ ఆటగాళ్లకు ఉందని మాజీలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం చూస్తే టీమిండియా టీ20 తదుపరి కెప్టెన్ గా రోహిత్ శర్మతోపాటు రిషబ్ పంత్, కేఏల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
రిషబ్ పంత్ ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. కీపర్ గా తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నాడు. ధోనిలా టీమిండియాను నడిపించగల సత్తా ఉందని పలువురు అంటున్నారు. ఇప్పటికే ఐపీఎల్ లో ఢిల్లీ కెప్టెన్ గా రిషబ్ పంత్ విజయవంతమయ్యాడు. ప్రస్తుతం టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.
ఇక శ్రేయాస్ అయ్యర్ కూడా కెప్టెన్ పోటీలో ఉన్నట్టు మాజీలు అంటున్నారు. 2018 నుంచి ఐపీఎల్ లో కెప్టెన్ గా శ్రేయాస్ రాణిస్తున్నాడు. తన హాయంలోనే ఢిల్లీని ఫైనల్ వరకూ తీసుకెళ్లారు.
ఇక మరోవైపు టీ20లో అమోఘమైన రికార్డు ఉన్న కేఎల్ రాహుల్ కూడా టీ20 కెప్టెన్ రేసులో ఉన్నాడు. 2019 నుంచి పంజాబ్ కెప్టెన్ గా అతడు ముందుడి నడిపిస్తున్న తీరు అద్భుతమేనని చెప్పాలి.
ఇక వీరందరిలోకి విజయవంతమైన టీ20 కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే. కెప్టెన్ పోటీదారుల్లో అందరికంటే ముందున్నాడు. ఎందుకంటే అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా ఐపీఎల్ గెలుస్తోంది. కోహ్లీ గైర్హాజరులో వరుస విజయాలతో టీమిండియాను ముందుకు నడిపించాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ గా రోహిత్ కొనసాగుతున్నాడు. దీంతో అతడికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.