• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత్ హెచ్చరికలకు...

భారత్ హెచ్చరికలకు దిగొచ్చిన యూరప్ దేశాలు

By - Tupaki Desk
Update: 2021-07-01 13:30 GMT
భారతదేశం దెబ్బకు యూరోపియన్ యూనియన్ దేశాలు దిగొచ్చాయి. భారత వ్యాక్సిన్లు వేసుకున్న ప్రయాణికులను అనుమతించమని మొండికేసిన యూరప్ దేశాల ప్రభుత్వాలకు భారత్ షాక్ ఇచ్చింది. అలా అయితే యూరప్ దేశాల వాసులను కూడా ఇండియాలో అనుమతించమని గట్టి క్వారంటైన్ విధిస్తామని హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన యూరప్ దేశాలు భారత్ ‘కోవిషీల్డ్’ టీకా వేసుకున్న వారికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

స్వయంగా ఈయూలోని బ్రిటన్ తయారు చేసిన కోవీషీల్డ్ టీకా వేసుకున్నా సరే వాటిని ఆమోదించకుండా యూరప్ లోకి ఎంట్రీ నిషేధాజ్ఞలు పెడుతున్న యురోపియన్ దేశాలకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్ లో కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేసుకున్న వారిని అనుమతించాలని లేదంటే యూరప్ దేశాల వారిని తాము కూడా అనుమతించమని.. క్వారంటైన్ చేస్తామని హెచ్చరించింది.

దీంతో తాజాగా కోవిషీల్డ్ టీకాను గుర్తిస్తున్నట్టు ఏకంగా 8 ఈయూ దేశాలు తాజాగా ప్రకటించాయి. స్విట్జర్లాండ్ తోపాటు ఈయూ దేశాలైన ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఐస్ ల్యాండ్, ఐర్లాండ్, స్పెయిన్, ఎస్టోనియా దేశాల ప్రభుత్వాలు కోవీషీల్ట్ టీకాను అనుమతిస్తున్నామంటూ తాజాగా ప్రకటించాయి.

కరోనా నేపథ్యంలో టీకా తీసుకున్న విదేశీ ప్రయాణికులనే ఐరోపా దేశాల్లోకి అనుమతించేందుకు వీలుగా ఐరోపా సమాఖ్య  గ్రీన్ పాస్ ( టీకా పాస్ పోర్ట్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ కేవలం 4 కరోనా టీకాలను మాత్రమే ఆమోదింత జాబితాలో చేర్చింది. అమెరికా తయారు చేసిన ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు తీసుకున్న వారికి మాత్రమే గ్రీన్ పాస్ జారీ చేస్తామని తెలిపింది. భారత్ లో తయారైన కోవిషీల్డ్ తీసుకున్న వారికి ఈ పాస్ రాదన్న ఆందోళనలు బయలు దేరాయి.

దీనిపై భారత ప్రభుత్వం సీరియస్ అయ్యింది. భారత్ లో తయారైన టీకాలను గుర్తించాల్సిందేనంటూ ఈయూ దేశాలకు తేల్చిచెప్పింది. లేని పక్షంలో భారత్ కు వచ్చే ఈయూ ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తప్పవు అని ఖారఖండీగా బదులిచ్చింది. భారత ఒత్తిడికి 9 ఈయూ దేశాలు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవీషీల్డ్ ను గుర్తిస్తున్నట్టు తాజాగా ప్రకటించాయి.

ఐరోపా సమాఖ్య నిబంధనల ప్రకారం భారత్ లో తయారైన కోవీషీల్డ్, కోవాగ్జిన్ లకు ఈఎంఏ గుర్తింపు లేదు. ఈ టీకాలు తీసుకున్న భారతీయులు యూరప్ దేశాలకు వెళ్లడానికి వీల్లేకుండా అయ్యింది. ఇది భారతీయులకు తలనొప్పిగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దింది. ఏకంగా యూరప్ దేశాలనే హెచ్చరించేలా వ్యవహరించి షాక్ ఇవ్వడంతో ఆ దేశాలు దిగివచ్చాయి.
Tags:    
  • European countries 
  • Covishield 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS