`ఇంజినీర్ చాయ్‌వాలా: ఐటీ జాబ్ వదిలేసి టీ షాప్ పెట్టుకున్నాడు

Update: 2020-09-04 05:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లక్షలు, కోట్లలో ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాలు కోల్పోయినవారు జీవనోపాధి కోసం ఎదో ఒకటి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వరంగల్‌లో ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ కూరగాయలు పెట్టుకొని వార్తల్లోకి చేరారు. ఆమెతో సినీ నటుడు సోనూసూద్ కూడా మాట్లాడారు. వేతనంతో కూడిన ఉపాధి దాదాపు నగరాల్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉద్యోగాల కోతం కూడా అక్కడే ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగాలు పోవడంతో వరంగల్‌లో కూరగాయలు అమ్మిన మహిళను, మాంసం విక్రయించిన వారిని, టిఫిన్ సెంటర్స్ పెట్టుకున్న వారిని చూస్తూనే ఉన్నాం.

అలాంటి మరో సంఘటనే ఇది. అయితే ఇది భిన్నమైన స్టోరీ. కరోనా కారణంగా ఉద్యోగాలు పోయి, చాలామంది జీవనం కోసం వివిధ మార్గాలు ఎంచుకుంటే, చింద్వారాకు చెందిన ఓ యువకుడు మాత్రం మంచి ఐటీ ఉద్యోగాన్ని తనంతట తానే వదులుకొని టీ కొట్టు పెట్టుకున్నాడు. నిత్యం ఒత్తిడితో కూడిన సాఫ్టువేర్ ఉద్యోగం పట్ల విసిగిపోయాడు. ఉద్యోగ సంతృప్తి ఏమాత్రం లేదు. దీంతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. సదరు యువకుడు గతంలో విప్రోలో మంచి వేతనంతో ఉద్యోగంలో ఉన్నాడు. ఇప్పుడు మాత్రం అతను వివిధ రకాల టీ, పోహాలు విక్రయిస్తున్నాడు.

ఇందుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అవనీష్ శరన్ ట్వీట్ చేశారు. ఇంజినీర్ చాయ్‌వాలా అని ఈ పోస్ట్ పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను చిన్నప్పటి నుండి ఏదైనా సొంతగా వ్యాపారం చేయాలని భావించాడు. కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. మంచి ఉద్యోగం, వేతనం ఉన్నప్పటికీ సంతృప్తి కలగలేదు. ఇప్పుడు తాను ఇష్టపడిన మార్గాన్ని ఎంచుకున్నాడు. మనీ కంటే ఆత్మసంతృప్తి ముఖ్యమని భావించిన అతనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News