• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎలాన్ మస్క్ పై లైంగిక...

ఎలాన్ మస్క్ పై లైంగిక ఆరోపణలు.. ఆయనేం పాడు పని చేశారు?

By - Tupaki Desk
Update: 2022-05-21 07:30 GMT
అపర కుబేరుడు.. టెస్లా అధినేత.. ఈ మధ్యనే ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్ ను కొనుగోలు చేసే నిర్ణయాన్ని ప్రకటించటం ద్వారా సంచలనంగా మారిన ఎలాన్ మస్క్ మీద లైంగిక ఆరోపణలు రావటం సంచలనంగా మారింది. ఆయన ప్రయాణించే బిజినెస్ ప్లయిట్ లో పని చేసే ఉద్యోగిని విషయంలో ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన ఒక కథనం మీడియాలో రావటం.. అది కాస్తా సంచలనంగా మారటంతో.. ఎలాన్ మస్క్ రంగంలోకి దిగారు. తన మీద వచ్చిన లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తల్ని ఖండించారు.

ఇంతకూ ఎలాన్ మస్క్ మీద వచ్చిన ఆరోపణలు ఏమిటి? అన్న విషయంలోకి వెళ్లినప్పుడు.. దాదాపు నాలుగేళ్ల క్రితం అంటే 2018లో తనకు చెందిన బిజినెస్ ఫ్లయిట్ లో అటెండర్ గా పని చేసే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపనలు ఉన్నాయి. ఎలాన్ కు చెందిన స్పేస్ ఎక్స్ కార్పొరేట్ జెట్ ఫ్లయిట్ లో కాంట్రాక్టు పద్దతిలో అటెండర్ గా పని చేసే మహిళ మొదట్లో ఎయిర్ హోస్టెస్ గా పని చేసేవారు.

అనంతరం ఆమెను.. మస్క్ కు మసాజ్ చేసే బాధ్యతను అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. 2016లో ఒక రోజు విమానంలో తన గదిలోకి రావాలని ఎలాన్ మస్క్ ఆదేశించటంతో సదరు అటెండెంట్ ఆయన గదిలోకి వెళ్లారు.

అప్పటికే ఫ్లయిట్ లో అర్థనగ్నంగా ఉన్న మస్క్.. ఆమె అనుమతి లేకుండానే కాలిపై తన చేతిని వేసి.. లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక కథనం మీడియాలో వచ్చింది. దీంతో.. ఈ ఎపిసోడ్ పై ఆయనే రంగంలోకి దిగారు.

తన మీద వచ్చిన ఆరోపణల్ని ఖండించే ప్రయత్నం చేశారు. తన మీద జరుగుతున్న దాడిని రాజకీయ కోణం నుంచి చూడాలన్నారు. మంచి ఫ్యూచర్.. స్వేచ్ఛగా మాట్లాడే విధానాన్ని తెర మీదకు తీసుకొస్తున్న వేళ.. తనపై జరుగుతున్న దాడులన్ని వ్యూహాత్మకమేనన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    
  • ElonMusk 
  • ElonTwitter 
  • ElonSexualHarrasment 
  • Employee 
  • BusinessFlight 
  • SpaceXCorporateJetFlight 
  • RumersonElonMusk 

Similar News

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS