ఏపీలో వేడి: వచ్చే నెల్లోనే నోటిఫికేషన్
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు వచ్చే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో పర్యటనకు సిద్ధమవుతున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఏపీలో రెండు విడతల్లో.. తెలంగాణలో ఒకే విడతలో నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లు కాస్త నెమ్మదిగా ఉన్న పార్టీలు ఇక ఏపీలో హోరు పెంచనున్నాయి. మే నెల చివరి వారంలోగా లోక్ సభ ఎన్నికల ప్ర్రక్రియను పూర్తి చేయాలని ఈసీ డిసైడ్ అయ్యింది.
ఫిబ్రవరి చివరి వారం లేదంటే మార్చి మొదటి వారంలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు.. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నోటిఫికేషన్ ప్రకటించనున్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. వివిధ రాష్ట్రాల్లో ఏఏ తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ఈసీ ఆరా తీయనుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన దరిమిలా పార్టీలు ఇక లోక్ సభకు మాత్రమే సమాయాత్తం కావాల్సి ఉంది. ఏపీలో మాత్రం పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు రెండూ జరగనున్నాయి.
2014లో కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 14న ఎన్నికల ప్రకటన చేసింది. తొమ్మిది దశల్లో దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఏప్రిల్ 7న తొలి దశ పోలింగ్ జరిగింది. మే 12న తుది దశ పోలింగ్ ముగిసింది. మే 16న ఓట్ల లెక్కింపు జరిపింది. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం ఈసీ మే 25లోగా ఎన్నికలు పూర్తి చేయడానికి రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే 175 అసెంబ్లీ , 25 లోక్ సభ నియోజకవర్గాల్లో రెండు విడతలుగా నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈసీ ప్రతినిధులు మాత్రం ఏపీలో ఒకే విడత నిర్వహించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ అని ఈసీ ప్రకటనతో తెలుగునాట పార్టీల్లో వేడి పుట్టింది. ముఖ్యంగా ఏపీలో వైసీపీ, టీడీపీ ఇక ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యాయి. చంద్రబాబు కీలక నిర్ణయాలు, ప్రజాకర్షక పథకాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఈనెల 21న కీలక కేబినెట్ బేటి నిర్వహిస్తోంది. 30న ఓటాన్ అకౌంట్, బడ్జెట్ సమావేశాలుంటాయి. విపక్ష వైసీపీ అభ్యర్థుల ఖారారుకు పూనుకుంది. 175 స్థానాల్లో 120 స్థానాల వరకు ప్రకటించేందుకు సిద్ధమైంది. పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ఎన్నికల సమరశంఖారావం పూరించేందుకు సిద్ధమయ్యారు. జనసేనాని పవన్ కూడా ఎన్నికల కోసం కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.