గుడ్లు పెడుతున్న రాయి.. ఈ వింత సైన్స్కే సవాల్

Update: 2022-06-20 23:30 GMT
శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అని ఓ పాటలో ఉన్నట్లు.. అద్భుతమైన శిల్పాలు సృష్టికి అందం తీసుకురావడమే కాదు.. కొన్నిసార్లు వింతలు కూడా చూపెడుతుంటాయి. అలాంటి వింత ఒకటి చైనాలో చోటుచేసుకుంది. అది కూడా ముప్పై ఏళ్లకు ఒకసారి కనిపించే అరుదైన వింత దృశ్యం.

వింతలు, విశేషాలు.. భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నవి ఏడు వింతలే అయినా.. రోజుకో వింత పుట్టుకొస్తూనే ఉంది. ఈ వింతలు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని సార్లు షాక్ కలిగిస్తాయి. అసలు అలా ఎందుకు జరుగుతాయో కారణం ఎవరికీ తెలియదు. ఆ వింత మాయలో పడి తెలుసుకోవాలనే ఆలోచన కూడా చాలా మందికి రాదు. వచ్చినా కొన్ని రహస్యాలుగానే మిగిలిపోతాయి. ఇలాంటి ఓ వింత రహస్యం చైనాలో బయటపడింది.

చైనాలోని గిజౌ ప్రావిన్స్లో ఓ శిల ప్రతి 30 ఏళ్లకోసారి గుడ్లు పెడుతుందట. ఇప్పటి వరకు కోడి, బాతు, పక్షులు, పాములు గుడ్లు పెట్టడం గురించి విని ఉంటాం. కానీ రాయి గుడ్డు పెట్టడం కాస్త వింతగానే ఉంది.

అది కూడా ముప్పై ఏళ్లకోసారి. ఈ శిల 30 ఏళ్లు తన లోపల గుడ్డును ఉంచడం ద్వారా పొదుగుతుందట. 30 ఏళ్లు కాగానే.. గుడ్డు దానంతట అదే బయటకు వస్తుందట. ఈ గుడ్లు మృదువుగా ఉండి.. 19 అడుగుల ఎత్తు.. 65 అడుగుల వెడల్పు ఉంటాయి. స్థానిక ప్రజలు ఈ రాళ్ల నుంచి వచ్చే గుడ్ల ను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ గుడ్లు నేలపై పడగానే గ్రామస్థులు తీసుకెళ్తారు.

చైనాలోని రహస్యమైన ఈ శిలను చాన్ డాన్ యా అని పిలుస్తారు. ఈ రాయి మొత్తం నలుపు రంగులో ఉంటుంది. దీని గుడ్లు కూడా నలుపు రంగులోనే ఉంటాయి. ఈ రాళ్లు కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. ప్రతి 30 ఏళ్లకోసారి గుడ్లు పెట్టడంపై శాస్త్రవేత్తలు పలు అధ్యనాలు చేశారు. కానీ ఇప్పటి వరకు దీని రహస్యాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు.

భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం..  ఈ శిల 50,00,00,000 సంవత్సరాల పురాతనమైనది. ఈ గుడ్లు శిలలోపల ప్రత్యేక కవచంలో బంధించి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కవచం పూర్తిగా తొలగిన తర్వాత రాళ్లు అవంతట అవే నేలమీద పడిపోతాయని చెబుతున్నారు. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల ప్రకారం గుడ్డురాళ్లలో మార్పులుంటాయని భావిస్తున్నారు.
Tags:    

Similar News