ఈడీ జాయింట్ విచారణలు.. దర్యాప్తు షెడ్యూల్ వైరల్

Update: 2023-03-18 11:10 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని డిసైడ్ అయ్యింది.  ఏకంగా ఈడీ దర్యాప్తు షెడ్యూల్ చేసింది. ఢిల్లీ హెడ్ క్వార్టర్ లో ఈ మేరకు ఏర్పాట్లు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తున్న ఈడీ.. ఇకపై మరింత స్పీడ్ పెంచేందుకు రెడీ అయ్యింది. ఇప్పటివరకూ అనుమానితులను, నిందితులను విడివిడిగా విచారణ చేసి వారి స్టేట్ మెంట్లను రికార్డ్ చేసింది.

ఇక జాయింట్ ఎంక్వైరీలు చేయాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే పలువురికి నోటీసులు జారీ చేయడం.. కస్టడీలో ఉన్న వారి గడువు పొడిగించడం లాంటి చర్యలు చేపట్టింది.

ఈనెల 20న కవిత, పిళ్లై, బుచ్చిబాబును కలిపి విచారించనున్నట్టు సమాచారం. అవసరమైతే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సిసోడియాను సైతం వారితో కలిపి విచారించే అవకాశాలున్నాయట..

ప్రస్తుతంగా ఇప్పటివరకూ వీరంతా ఈడీ ఆధీనంలోనే ఉన్నారు. కవితను కలిపి విచారించి అరెస్ట్ చేసే దిశగా ఈడీ ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈనెల 20న ఇదే చేయబోతోందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

సౌత్ గ్రూపు ఆర్థిక మూలాలపైనే స్పెసల్ ఫోకస్ చేసిన ఈడీ కీలకంగా మారిన పిళ్లై ద్వారానే కవితను అరెస్ట్ చేసే దిశగా ఆయన స్టేట్ మెంట్ పై గురిపెట్టినట్టుగా తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News