ఆర్థిక సర్వే 2021: దూసుకెళ్లనున్న జీడీపీ.. వ్యవసాయం భేష్

Update: 2021-01-29 11:40 GMT
ఫిబ్రవరి 1న కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రెడీ అయ్యారు. బడ్జెట్ కన్నా రెండు రోజులు ముందుగానే ఇప్పుడు ఎకనామిక్ సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ పై విశ్వాసం ఉంచారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యచిత్రాన్ని ప్రతిబించించే కీలకమైన ఆర్థిక సర్వే 2021ను ప్రవేశపెట్టారు. ఇందులోని ముఖ్యమైన అంశాలు అంటే ఎకనామిక్  సర్వే-2021 ప్రవేశపెట్టారు.  ఎకనామిక్ సర్వే 2021 ముఖ్యమైన అంశాలు  ఇలా ఉన్నాయి.

కరోనా నుంచి కోలుకొని ప్రీకోవిడ్ స్థాయికి వెళ్లడానికి రెండేళ్లు పట్టొచ్చు.  కేంద్ర ప్రభుత్వం హెల్త్ కేర్ రంగంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది.  పేదలను పేదరికం నుంచి బయటపడేయడానికి కేంద్ర ప్రభుత్వం  ఖచ్చితంగా ఆర్థిక వృద్ధిపై  దృష్టి పెట్టాల్సిందే. వృద్ధిని అలాగే కొనసాగించాలి.

కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం పడలేదు.  అన్ని రంగాలు చతికిలపడినా కూడా వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదైంది.ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా జీడీపీ 7.7శాతం మేర తగ్గొచ్చు. కానీ తర్వాత వీషేప్ రికవరీ ఉంటుందని ఆర్థిక సర్వేలో తేలింది.
Tags:    

Similar News