• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణ‌లో మ‌రో...

తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌!..5 నెల‌ల్లో మూడోది!

By - Tupaki Desk
Update: 2019-04-20 13:53 GMT
నిజంగానే తెలంగాణ‌లో ఐదు నెల‌లుగా ఎన్నిక‌ల కోలాహ‌లం కొన‌సాగుతూనే ఉంది. గ‌తేడాది న‌వంబ‌ర్ లో మొద‌లైన ఈ కోలాహ‌లం.. వ‌చ్చే నెల (మే) నెలాఖ‌రున ముగియ‌నుంది. అంటే మొత్తంగా గ‌డ‌చిన నాలుగు నెల‌ల‌తో పాటు వ‌చ్చే నెల కూడా తెలంగాణ‌లో ఎన్నిక‌ల కోలాహ‌ల‌మే. డిసెంబ‌ర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా... ఈ నెల 11న లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రిగాయి. తాజాగా వ‌చ్చే నెల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రంగం సిద్దం అయిపోయింది. ఈ మేర‌కు తెలంగాణ ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసింది.

ఈ షెడ్యూల్ ప్ర‌కారం తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల(మండ‌ల ప‌రిష‌త్‌ - జిల్లా ప‌రిష‌త్‌) ఎన్నిక‌లు మూడు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. వ‌చ్చే నెల 6న తొలి ద‌శ పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా - రెండో ద‌శ పోలింగ్ మే 10న‌ - మూడో ద‌శ పోలింగ్ మే 14న జ‌ర‌గ‌నుంది. మూడు ద‌శ‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత మే 27 కౌంటింగ్ జ‌రుగుతుంది. అంటే 5 నెలల్లో జ‌ర‌గ‌నున్న మూడో ఎన్నిక మే నెలాఖ‌రుతో ముగియ‌నుంద‌న్న‌మాట‌. ఈ మేర‌కు మూడు ద‌శ‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ నాగిరెడ్డి కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు.

రాష్ట్రంలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు - 539 జెడ్పీస్థానాలు ఉన్నాయని నాగిరెడ్డి పేర్కొన్నారు. 47 ఎంపీటీసీ స్థానాలతో పాటు - మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించడం లేదని ఆయ‌న‌ వెల్లడించారు. ఇక ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించిన కోడ్ కూడా నేటి నుంచి అమలులోకి వ‌చ్చేసిన‌ట్టుగా ఆయ‌న పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్‌ లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసే అవకాశం కల్పించామని పేర్కొన్న ఆయ‌న‌... ఈ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో జరుగుతాయని చెప్పారు. తెలుపు రంగులో ఎంపీటీసీల బ్యాలెట్‌ పేపర్‌ - గులాబీ రుంగులో జెడ్పీటీసీల బ్యాలెట్‌ పేపర్లు ఉంటాయని తెలిపారు.

మూడు ద‌శ‌ల ఎన్నిక‌ల షెడ్యూల్ ఇలా...

తొలి దశలో(197 జెడ్పీటీసీలు..2166 ఎంపీటీసీలు స్ధానాలు)

నామినేషన్‌: ఏప్రిల్‌ 22 నుంచి ఏప్రిల్‌ 24 వరకు
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 25న
ఫిర్యాదులు: ఏప్రిల్‌ 27
నామినేషన్‌ ఉపసంహరణ: ఏప్రిల్‌ 28 వరకు
పోలింగ్‌: మే 6న

రెండో దశ(180 జెడ్పీటీసీలు..1913 ఎంపీటీసీలు స్ధానాలు)

నామినేషన్‌: ఏప్రిల్‌ 26 నుంచి ఏప్రిల్‌ 28 వరకు
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 29న
ఫిర్యాదులు: మే 1న
నామినేషన్‌ ఉపసంహరణ: మే 2 వరకు
పోలింగ్‌: మే 10న

మూడో దశ(161 జెడ్పీటీసీలు..1738 ఎంపీటీసీలు స్ధానాలు)

నామినేషన్‌: ఏప్రిల్‌ 30 నుంచి మే 2 వరకు
నామినేషన్ల పరిశీలన: మే 3న
ఫిర్యాదులు:  మే 5న
నామినేషన్‌ ఉపసంహరణ: మే6 వరకు
పోలింగ్‌: మే 14

మూడు ద‌శ‌లు పూర్తి అయిన త‌ర్వాత సార్వ‌త్రిక ఎన్నిక‌ల కౌంటింగ్ పూర్తి అయిన త‌ర్వాత మే 27న ఈ ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది.


Tags:    
  • EC 
  • ZPTC 
  • MPTC 
  • Elections 
  • Telangana 

Similar News

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

Copyright @2026

Powered by Blink CMS