కంపిస్తున్న భూమి: జపాన్ లో మరో భారీ భూకంపం..
భూమి కంపిస్తోంది. వరుసగా భూకంపాలు వస్తున్నాయి. నిన్నటికి నిన్న కజికిస్తాన్, ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు వచ్చిన మరుసటి రోజే జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ లో శనివారం రాత్రి ఈ భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 7.1గా ఉంది. మియాగి, ఫకసిమా, టోహోకు ప్రాంతంలో ఈ భూకంప ప్రభావం భారీగా ఉంది.
ఇప్పటిదాకా వచ్చిన భూకంపాల్లో ఇది భారీ భూకంపంగా అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రకంపనలు టోక్యో వరకు వినిపించాయి.
నిన్న రాత్రి 11.08 గంటలకు ప్రకంపనాలు మొదలయ్యాయి. భారీ భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపంతో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.భూకంపం కేంద్రం లోతులో ఉండడం.. తీరం మధ్య దూరం ఉండడంతో ప్రభావం లేదని అధికారులు తెలిపారు.
ఈటోరొపు ద్వీపంలో భూకంప కేంద్రం ఉంది. దీనిపై జపాన్, రష్యా మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇక భూకంపంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని ప్రధాని యోషిహిడే సుగా సమీక్షించారు. తీర ప్రాంత ప్రజలను తరలిస్తున్నామని తెలిపారు. దాదాపు 9.5 లక్షల మంది నిలువ నీడ లేకుండా ఇప్పుడు పునరావాస శిబిరాలకు తరిలారు.
జపాన్ లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా 6 అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాల్లో 20శాతం ఇక్కడే వస్తాయి.