ఇక.. 16 ఏళ్లకే డ్రైవింగ్ లైసెన్స్

Update: 2016-06-14 06:54 GMT
చేతికి డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే 18 ఏళ్ల వయసు ఉండాల్సిందే. అంతకంటే తక్కువ వయసు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కు అనుమతి ఇవ్వరు. ఇది ఇప్పటివరకూ అమలవుతున్న రూల్. కాకుంటే.. ఇకపై ఈ రూల్ లో మార్పు రానుంది. ఇప్పటివరకూ అమలు చేస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనను మార్చాలంటూ పలు రాష్ట్రాల రవాణా మంత్రులతో కూడిన కమిటీ కేంద్రానికి సిఫార్పు చేస్తున్న నేపథ్యంలో కొత్త నిర్ణయాన్ని తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేయనుందన్న మాట చెబుతున్నారు.

ప్రస్తుతం గేర్ లేని వాహనాల్ని ఇంటర్.. డిగ్రీ విద్యార్థులు నడుపుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న చట్టంలో మార్పులు తేవాలని భావిస్తున్నారు. మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల్ని కేంద్రం కానీ అమలు చేయాలని భావించిన పక్షంలో 16 ఏళ్ల వయస్కులకు డ్రైవింగ్ లైసెన్స్ లు ఇచ్చే వీలుంది. గేర్లు లేని స్కూటీ తరహా వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే వీలుంది. 100 సీసీ కన్నా తక్కువ పరిమితి ఉన్న వాహనాల్ని నడిపేందుకు 16 ఏళ్ల వయసు నుంచే డ్రైవింగ్ లైసెన్స్ లు ఇవ్వాలని మంత్రుల కమిటీ అభిప్రాయపడింది. మరి.. మంత్రుల కమిటీ సూచనపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News