ప్రతిపక్షాలకు 'గిరిజన' దెబ్బ

Update: 2022-06-25 11:30 GMT
వచ్చే ఏడాది జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము దెబ్బ ప్రతిపక్షాలపై స్పష్టంగా కనబడుతోంది. ఎన్డీయే తరపున ద్రౌపది పోటీ చేస్తుండగా, నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే ద్రౌపది గిరిజన నేత కావటమే ప్రతిపక్షాలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. పార్టీలకు అతీతంగా గిరిజన నేత ద్రౌపదికి మద్దతివ్వాలనే డిమాండ్ గిరిజనుల నుండే పెరిగిపోతోంది.

మొన్నటి వరకు జార్ఖండ్ గవర్నర్ కు పనిచేశారు ద్రౌపది. కాబట్టి జార్ఖండ్ లోని చాలామంది ఎంపీలు, ఎంఎల్ఏలతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ప్రమాణస్వీకారం చేసినపుడు గవర్నర్ గా ద్రౌపదే ఉన్నారు.

పైగా ఈ రాష్ట్రంలో అత్యధికులు గిరిజనులే. దాంతో సంకీర్ణ ప్రభుత్వంలో చాలా మంది ఎంపీలు, ఎంఎల్ఏలు ఈమెకే మద్దతిచ్చే అవకాశాలున్నాయట. ఇప్పటికే ఇదే విషయమై ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే ద్రౌపది గిరిజన నేత కాకుండా సొంత రాష్ట్రం ఒడిస్సానే. కాబట్టి ఎస్టీలంతా ఆమెకే మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకనే నవీన్ ఇదంతా ఆలోచించే ద్రౌపదికి మద్దతు పలికారు. ఇక చత్తీస్ ఘడ్ లో కూడా ఇదే పరిస్ధితి. ఇక్కడి జనాభాలో 30 శాతం ఎస్టీలే. కాబట్టి ఎంపీలు, ఎంఎల్ఏల్లో కూడా వాళ్ళే ఎక్కువ. కాబట్టి ద్రౌపదిని వ్యతిరేకించాలని కాంగ్రెస్, ప్రతిపక్షాల అధినేతలు చెప్పినా మాట వినే అవకాశాలు తక్కవనే చెప్పాలి.

మొత్తానికి నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన ద్రౌపది అభ్యర్థిత్వంపై పార్టీలకు అతీతంగా ఎక్కువ మంది ఎంపీలు ఆమెకు ఓట్లేసే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఆలోచించే ద్రపదిని మోడి అభ్యర్ధిని చేసినట్లుంది.

మొత్తానికి ద్రపది అభ్యర్ధిత్వం నాన్ ఎన్డీయే పార్టీల్లో పరస్పరం విశ్వాసాన్ని దెబ్బతీసేట్లుగా ఉందనటంలో సందేహం లేదు. చివరకు ఓటింగ్ తర్వాత కానీ ప్రతిపక్షాల ఐక్యత ఏ రేంజిలో ఉందో బయటపడదు.
Tags:    

Similar News