• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత పర్యటనను...

భారత పర్యటనను మర్చిపోలేకపోతున్న ట్రంప్

By - Tupaki Desk
Update: 2020-03-01 14:30 GMT
ఒక రాజకీయ నాయకుడికి ఏం కావాలి. కోట్ల మంది ప్రజాభిమానం కావాలి. అదే ఓట్ల వాన కురిపిస్తుంది. తన సభకు ఎంత మంది వస్తే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని భావిస్తాడు. భారత్ లో అయితే కోట్ల మంది ఉన్నారు. సభ పెడితే లక్షల్లో వస్తారు. అదే అగ్రరాజ్యం అమెరికాలో.. సంపద బాగా ఉండడంతో  అమెరికాలో సభలు, సమావేశాలకు పెద్దగా జనాలు రారు. అందుకే భారత్ లో మొతేరా స్టేడియంలో 1.25 లక్షల మంది సమక్షంలో ప్రసంగించాక అమెరికాలో సభలను చూసి ట్రంప్ నిరాసక్తిగా ఉన్నాడట..  ఇప్పటికీ అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో 1.25లక్షల మంది సమక్షంలో చేసిన ప్రసంగాన్నే అద్భుతమని భావిస్తున్నాడు...

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో జరిగిన  ఓ సభలో మాట్లాడారు. దీనికి 10-15వేల మంది మాత్రమే హాజరయ్యారు. వారిని చూసి ట్రంప్ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. 150కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో అంతమంది జనాలు సభకు వచ్చినప్పుడు.. అంతకన్నా తక్కువ జనాభా కలిగిన అమెరికాలో ఇంతమంది సభకు రావడం గొప్ప విషయమేనని ట్రంప్ తన భారత పర్యటన అనుభవాలను గొప్పగా చెప్పుకొచ్చాడు.  అమెరికా పట్ల భారత్ లో ఎంతో ఆదరణ ఉందని పేర్కొన్నారు.

 ఈ సందర్భంగా  ట్రంప్.. భారత్ లో జరిగిన సభ జ్ఞాపకాలను అందులో ప్రస్తావించి మోడీని కొనియాడారు. మోడీ భారత్ లో మంచి ఆకర్షనీయమైన, ఆదరణీయ వ్యక్తి అని ప్రజలు మెచ్చిన ప్రియతమ నాయకుడు అంటూ కొనియాడారు. భారత పర్యటన తనకు చాలా అనుభవాలను మిగిల్చిందని ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను మన ప్రధాని మోడీ అండ్ కో నెత్తిన పెట్టుకుంది. ట్రంప్ కు చేసిన ఏర్పాట్లు, స్వాగత సత్కారాలు అదిరిపోయాయి.   ఒక చక్రవర్తిలాగా ట్రీట్ చేయడంతో  ట్రంప్ ఫిదా అయిపోయాడు. అందుకే అమెరికా వెళ్లగానే ఇంకా భారత పర్యటన తాలూకా అతిథి సత్కారాలు, సన్మానాలు, గౌరవాన్ని మరిచిపోలేకపోతున్నాడు. ట్రంప్ కు భారీ సభలన్నా, పెద్ద గుంపును చూసి ప్రసంగించడం అన్నా మహా ఇష్టం. అయితే అమెరికాలో జనాలు పెద్దరాని సభల్లో ప్రసంగిస్తూ ఇలా భారత్ పై ప్రేమను చాటాడు.


Tags:    
  • Donald Trump 
  • India Visit 
  • Telugu NEws 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS