సడన్ ఎంట్రీతో అందరిని సర్ ప్రైజ్ చేసిన ట్రంప్

Update: 2019-09-24 07:13 GMT
ప్రధాని మోడీ అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. అమెరికా అధ్యక్షుడి మనసును దోచుకునే విషయంలో మోడీ వరుస పెట్టి సక్సెస్ అవుతున్నారని చెప్పాలి. తన మాటలతో ట్రంప్ ను మోడీ ప్రభావితం చేస్తున్నారా? అన్న సందేహం కలిగేలా తాజా ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. హోస్టన్ సభ తర్వాత న్యూయార్క్ వెళ్లిన మోడీ.. అక్కడ ఐక్యరాజ్య సమితి వాతావరణ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మోడీ ప్రసంగిస్తున్న వేళ.. అక్కడకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రావటం విశేషం. దీనికి కారణం లేకపోలేదు. ఆ ప్రాంగణానికి ట్రంప్ వెళతారన్న షెడ్యూల్ కూడా లేదు. కానీ.. అందుకు భిన్నంగా మోడీ మాట్లాడే సమయానికి వెళ్లిన ఆయన కామ్ గా కూర్చొని మోడీ మాటల్ని శ్రద్ధగా వినటంతో పాటు.. జర్మనీ ఛాన్సలర్ మాటల్ని కూడా వినటం ఆసక్తికరంగా మారింది.

 వాతావరణ సమస్యలపై జరిగిన సదస్సులో మాట్లాడిన ప్రదాని మోడీ మాటలు కట్టిపెట్టి చేతల్లో చేసి చూపాలని.  భారత్ కూడా ప్లాస్టిక్ ను నిషేధించి చేతల్లో చూపుతుందని పేర్కొన్నారు. అదే తీరులో ప్రపంచం మొత్తం స్పందించాలని పిలుపునిచ్చారు. వాతావరణ సమస్యలకు సంబంధించి ప్రపంచ దేశాల మధ్య పారిస్ ఒప్పందం జరగ్గా.. దాని నుంచి ట్రంప్ తప్పుకున్నారు. అందులోని నిబంధనలు అర్థం పర్థం లేనట్లు ఉన్నాయంటూ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి బయటకు రావటం.. దీనిపై భారత్ తప్పు పట్టింది కూడా. ఈ నేపథ్యంలో వాతావరణ సదస్సుకు ట్రంప్ రావాల్సిన అవసరమే లేదు. కానీ.. మోడీ స్పీచ్ వినేందుకుఆయన ప్రత్యేకంగా వచ్చినట్లుగా చెబుతున్నారు. మోడీ.. జర్మనీ వైస్ ఛాన్సలర్ స్పీచులుఅయ్యాక ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోవటం గమనార్హం. మొత్తంగా షెడ్యూల్ లో లేకున్నా సడన్ ఎంట్రీలో అందరిని సర్ ప్రైజ్ చేశారని చెప్పాలి.
Tags:    

Similar News