కమలా కమ్యూనిస్ట్ అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన ట్రంప్!

Update: 2020-10-09 12:30 GMT
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి , ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ పెరిగిపోతుంది. ఈ ఎన్నికల ప్రచార సమయంలో  క‌రోనా వైర‌స్ భారిన పడి ,కరోనా నుండి కోలుకున్న అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ప్ర‌జాజీవితంలోకి  రాబోతున్నారు. ఈ శ‌నివారం ఆయ‌న ఫ్లోరిడాలో ర్యాలీ నిర్వ‌హిస్తార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఆయ‌న వైట్ ‌హౌజ్ నుంచి ఫాక్స్ న్యూస్ ‌తో ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు.

నవంబర్ 3న జరగబోయే  అధ్యక్షుడి  ఎన్నిక‌ల్లో ఒక‌వేళ బైడెన్ గెలిస్తే, అప్పుడు క‌మ్యూనిస్టు క‌మ‌లా హారిస్ నెల‌లోపే ప‌గ్గాల‌ను త‌న చేతుల్లోకి తీసుకుంటుంద‌ని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  క‌మ‌లా క‌మ్యూనిస్టు అని, ఆమె సోష‌లిస్టు కాదు అని, ఆమె అభిప్రాయాల‌ను ఓసారి ప‌రిశీలించండి, స‌రిహ‌ద్దుల్ని ఓపెన్ చేసి, హంత‌కుల‌ను, రేపిస్టుల‌ను దేశంలోకి ఆహ్వానించాల‌నుకున్న‌ద‌ని ట్రంప్ ఆరోపించారు.  క‌మ‌లా హారిస్ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థుల చ‌ర్చ‌లో పాల్గొన్న త‌ర్వాత ట్రంప్ ఈ కామెంట్ చేశారు.  మ‌న‌కు ఓ క‌మ్యూనిస్టు నేత‌గా రాబోతున్నార‌ని, నేను జోసెఫ్ బైడెన్‌ తో చ‌ర్చ‌లో పాల్గొన్నాన‌ని, ఆయ‌న రెండు నెల‌ల క‌న్నా ఎక్కువ కాలం అధ్య‌క్షుడిగా చేయ‌లేర‌ని, అది నా అభిప్రాయం అని ట్రంప్ అన్నారు.  

 రిపబ్లికన్, డెమొక్రటికల్ పార్టీలకు చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థులు మైక్ పెన్స్, కమలా హారిస్ మధ్య బుధవారం డిబేట్ జరిగిన విషయం తెలిసిందే. డిబేట్ సందర్భంగా కమలా హారిస్ ట్రంప్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. కరోనా కట్టడిలో ట్రంప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే, అమెరికాలో రెండు లక్షలకుపైగా కరోనా మారణాలు నమోదయ్యాయని విమర్శించారు.కాగా, ఈ డిబేట్ ‌ను ప్రసార మాధ్యమాల్లో వీక్షించిన ట్రంప్ ముఖాముఖి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌పై ఈ విధమైన సంచలన ఆరోపణలు చేశారు.
Tags:    

Similar News