స్వీటీ స్పెషల్.. ఒక్క ఈతలో 18 పిల్లలకు జన్మనిచ్చింది

Update: 2020-11-12 05:45 GMT
గుంటూరు జిల్లాకు చెందిన శునకం ఒకటి వార్తల్లోకి వచ్చింది. గ్రేట్ డాని బ్రీడ్ కు చెందిన ఈ కుక్క ఒకే ఈతలో ఏకంగా పద్దెనిమిది పిల్లలకు జన్మనివ్వటం ఆసక్తికరంగా మారింది.  గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడుకు చెందిన సైదారావు అనే వ్యక్తి ఈ కుక్కను పెంచుకుంటున్నాడు.

దీనికి స్వీటీ పేరుతో పిలుచుకుంటూ పెంచుకుంటున్నారు. తమ ఇంట్లో బిడ్డలా సాకే స్వీటీ ఏకంగా ఇన్ని పిల్లలకు జన్మనివ్వటం సంతోషంగా ఉందని చెబుతున్నారు. సాధారణంగా కుక్కలు ఐదు నుంచి పది పిల్లల్ని ఒకే ఈతలో కనేస్తుంటాయి. అయితే.. ఒకే ఈతలో పద్దెనిమిది పిల్లలకు జన్మనివ్వటం మాత్రం చాలా అరుదుగా చెబుతున్నారు.

తొలి ఈతలో 10 పిల్లలు పుట్టగా.. తాజాగా రెండోసారి పద్దెనిమిది పిల్లలకు జన్మనివ్వటం.. అందులో 11 ఆడవి కాగా.. ఏడు మగవిగా తేలాయి. ఇంత భారీ సంఖ్యలో ఒకే ఈతలో పిల్లలు పుట్టటం చాలా అరుదుగా పశు వైద్యాధికారులు చెబుతున్నారు. సూపర్ ఓవలేషన్ కారణంగా ఇలా జరుగుతుందని చెబుతున్నారు.
Tags:    

Similar News