ముఖేశ్ అంబానీ సంపాదన గంటకు ఎంతో తెలుసా?

Update: 2020-09-30 07:15 GMT
మొన్నటి వరకు దేశీయంగా కుబేరుడు.. ఈ మధ్య కాలంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా మారిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయన ఆస్తి.. ఆదాయం ఏ స్థాయిలో పెరుగుతుందన్న విషయంపై తరచూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన ఆస్తి ఏ రేంజ్ లో పెరుగుతుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా తెలిపేలా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్టు 2020 జాబితాను తాజాగా వెల్లడించారు.

ఇందులో ముకేశ్ వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానంలో నిలిచారు. తాజాగా ఆయన సంపద రూ.2.77 లక్షల కోట్ల నుంచి రూ.6.58లక్షల కోట్లకు పెరిగినట్లుగా పేర్కొన్నారు. రిలయన్స్ జియో.. రిలయన్స్ రిటైల్ లోకి భారీగా పెట్టుబడులు రావటంతో షేర్ మార్కెట్ లో షేరు ధర భారీగా పెరిగింది. ఆగస్టు 31తో ముగిసిన పన్నెండు నెలల కాలానికి ముకేశ్ అంబానీ ఆస్తి 73 శాతం పెరిగినట్లుగా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వెయ్యికోట్లకు పైనే సంపద ఉన్న 828 మందిని పరిశీలించారు. వీరిలో 627 మంది సంపద పెరగ్గా.. మరో 229 మంది సంపద మాత్రం తగ్గినట్లుగా గుర్తించారు.

మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ముకేశ్ అంబానీ సంపాదన గంటకు రూ.90 కోట్లుగా లెక్కించారు. ఒక మోస్తరు జీవులు తమజీవితకాలంలో సంపాదించలేని మొత్తాన్ని ముకేశ్ మాత్రం కేవలం గంటలో సంపాదించటం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఈ జాబితాలో గత ఏడాది చోటు దక్కించుకున్న వారిలో 75 మంది ఈసారి మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. కోవిడ్ నేపథ్యంలో ప్రపంచంలోని పలువురు ఆస్తుల లెక్కలు మారిపోతే.. అందుకు భిన్నంగా ముకేశ్ ఆస్తులు మాత్రం అనూహ్యంగా పెరగటం గమనార్హం. ఇక.. ఈ జాబితాలో కొత్తగా 162 మంది చోటు దక్కించుకున్నారు.

ఆదాయంలో ముకేశ్ అంబానీ మొదటిస్థానంలో నిలిస్తే.. టాప్ టెన్ కుబేరుల జాబితాలో హిందూజా సోదరుల సంపద రూ.1.43లక్షల కోట్లకు చేరుకుంది. కానీ.. వారి ఆస్తి 23 శాతం క్షీణించింది. మూడో స్థానంలో శివనాడార్ ఫ్యామిలీ ఆస్తి మాత్రం 34 శాతం పెరిగింది. ప్రస్తుతం శారి ఆస్తి రూ.1.41లక్షల కోట్లుగా తేల్చారు. నాలుగో స్థానంలో గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ ఆస్తి రూ.1.40 లక్షల కోట్లుగా గుర్తించారు. ఐదో స్థానంలో విప్రో అజీజ్ ప్రేమ్ జీ కుటుంబ ఆస్తి రూ.1.14లక్షల కోట్లుగా గుర్తించారు. గతంతో పోలిస్తే ఈసారి సంపద రెండు శాతం క్షీణించింది.

ఆరో స్థానంలో సైరస్ పూనావాలా సంపద రూ.94.3 వేల కోట్లుగా.. ఏడో స్థానంలో రాధాకిషన్ ధమానీ అండ్ ఫ్యామిలీ సంపద రూ.87.2వేల కోట్లకు చేరుకుంది. ఎనిమిదో స్థానంలో ఉదయ్ కోటక్ సంపద రూ.87వేల కోట్లకు తగ్గింది. గతంతో పోలిస్తే సంపద ఎనిమిది శాతం క్షీణించింది. తొమ్మిదో స్థానంలో దిలీప్ శాంఘ్వీ రూ.84వేల కోట్లకు చేరుకోగా.. పదో స్థానంలో సైరస్ పల్లోంజీ మిస్త్రీ.. షాపూర్ జీ పల్లోంజీ మిస్త్రీ సంపద రూ.70వేల కోట్లకు పరిమితైమంది. గత ఏడాదితో పోలిస్తే.. తొమ్మిది స్థానం క్షీణించినట్లుగా తెలుుస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. లిస్టులో ప్రథమ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ ఆస్తి ఒక దశలో 28 శాతానికి క్షీణించింది. అదే సమయంలో వివిధ కంపెనీలు రిలయన్స్ లోని వాటాల్ని కొనుగోలు చేయటం షురూ అయ్యిందో అప్పటి నుంచి ముకేశ్ ఆస్తుల విలువ అంతకంతకూ పెరగటం ఎక్కువైంది. వాటాల కొనుగోలు కారణంగా ముకేశ్ సంపద 73 శాతం పెరిగినట్లుగా లెక్కలు కట్టారు. తగ్గి..దూసుకెళ్లటం ముకేశ్ కు మాత్రమే సాధ్యమేమో?
Tags:    

Similar News