కరోనాను నాలుగైదు రోజుల్లో కంట్రోల్ చేసే కిటుకు చెప్పిన మనోడు
వణికించే కరోనాకు కళ్లాలు ఎలా వేయాలన్నది ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది. ప్రపంచాన్ని వేధిస్తున్న ఈ సమస్యను అధిగమించేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో.. వివిధ దేశాల్లో అనుసరిస్తున్న పద్దతుల మీద ఒక కన్నేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా.. వాట్సాప్ లాంటి సాంకేతికతతో ఎవరైనా ఏదైనా అంశానికి సంబంధించి కొత్త విధానాన్ని అనుసరించినా.. పాజిటివ్ ఫలితాలు కనిపించినా వెంటనే వారు.. ఆ విషయాల్ని షేర్ చేసుకోవటంతో.. మిగిలిన వారు సైతం ఒక ప్రయత్నం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
తాజాగా అలాంటి కాంబినేషన్ ను చెప్పుకొచ్చారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్యులు బీరం రవిచంద్ర. కరోనాను కంట్రోల్ చేసేందుకు అవసరమైన మందుల కాంబినేషన్ ను చెప్పుకొచ్చారు. మలేరియా నివారణకు వినియోగించే క్లోరోక్విన్ తో పాటు.. మరికొన్ని మందుల్ని వినియోగించటం ద్వారా కరోనాను నాలుగైదు రోజుల్లో నియంత్రించే వీలుందన్న కొత్త మాటను ఆయన చెబుతన్నారు.
కరోనా అనుమానిత కేసుల్లోనే కాదు పాజిటివ్ కేసులతో సన్నిహితంగా ఉండే వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలో భాగంగా క్లోరోక్విన్ వాడాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సు చేసిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. క్లోరోక్విన్ కానీ హైడ్రాక్సీక్లోరోక్విన్ తో పాటు అజిత్రోమైసిన్ తీసుకోవటం ద్వారా కరోనాను నాలుగైదు రోజుల్లోనే నియంత్రించే అవకాశం ఉందన్నారు.
వైరస్ శరీరంలోకి రాకుండా ఉండేలా ఈ మందులు అడ్డుకుంటాయన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. గర్భిణులు హైడ్రోక్సీ క్లోరోక్విన్ వాడాలన్న ఆయన.. చైనాలో ఈ మందుల్ని వాడటం వల్లే కరోనాను కంట్రోల్ చేయగలిగారని చెప్పారు. ఆయన మాటలు విన్నంతనే కొండంత భరోసా కలిగిస్తాయని చెప్పక తప్పదు. మరి.. ఈ మందుల్ని ఎవరెవరు వాడాలి? ఎంత మోతాదులో వాడాలి? లాంటి విషయాల్ని ప్రభుత్వ పరంగా ప్రకటిస్తే.. మరింత బాగుంటుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకుంటే అనవసరమైన ప్రయోగాలతో లేనిపోని సమస్యలు తెచ్చుకునే డేంజర్ ఉందన్నది మర్చిపోకూడదు.