అయోధ్యలో శంకుస్థాపనకు ఎంతమంది రానున్నారు?

Update: 2020-07-20 06:45 GMT
ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేయనుంది.అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న కల సాకారం చేసుకునే దిశగా హిందూ సంస్థలు.. మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీరామ మందిరానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆగస్టు ఐదుగా డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయ భూమిపూజకు హాజరు కావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాల్ని పంపుతోంది. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్న విషయం ఇప్పటికే వార్తలుగా మారటం తెలిసిందే.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామజన్మభూమిలో నిర్మిస్తున్న రాయాలయం భూమిపూజకు 250 మంది వరకు అనుమతిస్తారని చెబుతున్నారు. రామాలయం కోసం పోరాడిన సాధువులు.. రాముడి గుడి కోసం న్యాయపోరాటం చేసిన వారుజాబితాలో ఉంటారని తెలుస్తోంది. వీరితో పాటు కొందరు కేంద్రమంత్రులు..యూపీ ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులు కూడా ఉండే వీలుంది.

రామాలయం కోసం బలంగా గళం వినిపించిన ఆర్ఎస్ఎస్.. విహీచ్ పీ.. భజరంగ్ దళ్ తదితర సంఘాలకు చెందిన వారు కూడా ఉంటారని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ కరోనా వేళలో ఏ వేడుక అయినా యాబైకు మించి హాజరు కాకూడదన్న నియమం మాటేమిటి? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

పెళ్లి లాంటి కార్యక్రమాలకుయాభైకు లోపే హాజరు కావాలని చెప్పే వేళలో.. రామాలయ భూమి పూజ వేళ.. కరోనా నిబంధనలు వర్తించవా?అన్నది ప్రశ్నగా మారింది.అతిధులే 250 మంది అయినప్పుడు.. అక్కడకు వచ్చే ప్రముఖుల సెక్యురిటీ.. వాహనాలు.. వారి సిబ్బంది మొత్తం లెక్క వేస్తే.. ఎంతమంది తేలుతారో? విపత్తు వేళ.. హడావుడి అవసరమా? అన్నది అసలు ప్రశ్న.
Tags:    

Similar News