బయటకొచ్చిన అమ్మ మేనకోడలి ఆస్తులు

Update: 2017-03-24 16:42 GMT
అమ్మ మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలో జయలలిత మేనకోడలు దీప కూడా బరిలోకి దిగటం తెలిసిందే. అమ్మకు అసలుసిసలు రాజకీయ వారసురాలిని తానేనని చెప్పుకుంటున్నదీప.. గత నెలలో ‘‘ఎంజీఆర్ అమ్మ దీప పెరవయి’’ పేరిట ఒక రాజకీయ వేదికనుఏర్పాటు చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి..అమ్మ స్థానాన్ని భర్తీ చేస్తానని బలంగా నమ్ముతున్న ఆమె తాజాగా నామినేషన్ దాఖలు చేయటం తెలిసిందే.

తన నామినేషన్ లో తనకున్న ఆస్తుల గురించి వెల్లడించారు దీప. తనకు మొత్తం రూ.3.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా ప్రకటించిన ఆమె.. రూ.2కోట్ల విలువైన స్థిరాస్తుల్ని.. రూ.1.05 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లుగా వెల్లడించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.5.37 లక్షల ఆదాయం వచ్చినట్లుగా పేర్కొన్నారు. గత ఏడాది రూ.17.50 లక్షలకు1600 చదరపు అడుగులస్థిరాస్తిని కొనుగోలు చేశానని..దాని మార్కెట్ విలువ రూ.2 కోట్లు ఉన్నట్లుగా వెల్లడించారు.

బ్యాంకులకు రూ.6.15 లక్షల రుణాన్ని చెల్లించాల్సి ఉందని.. మరో ముగ్గురి నుంచి రూ.70.65 లక్షలఅప్పు తీసుకున్నట్లు ప్రకటించారు. 2016లోరూ.50,390 మొత్తంతో ఒకస్కూటర్ కొన్నట్లుగా వెల్లడించిన ఆమె.. తనకు రూ.23.80 లక్షల విలువైన  821 గ్రాముల బంగారం..రూ.4లక్షల విలువైన 20 కేరట్ వజ్రాలు ఉన్నట్లుగా వెల్లడించారు. చేతిలో రూ.3లక్షలు.. బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో రూ.1.77 లక్షల మొత్తం సేవింగ్స్ రూపంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. వచ్చే నెల 12న జరిగే ఉప ఎన్నికల బరిలో దిగనున్న దీప లక్ష్యానికి ఆర్కే నగర్ ప్రజలు ఎంతమేర సహకరిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News