• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కొత్త జిల్లాలలో...

కొత్త జిల్లాలలో వికేంద్రీకరణ మంత్రం...?

By - Tupaki Desk
Update: 2022-02-05 17:30 GMT
కొత్త జిల్లాలు ఏపీలో మరో పదమూడు ఏర్పాటు అయ్యాయి. వాటికి సంబంధించి నోటిఫికేషన్ ప్రకటించిన తరువాత నుంచి ఎక్కడ చూసినా మంటలే రాజుకుంటున్నాయి. ప్రజల ఆకాంక్ష అలాంటిది. ఒక విధంగా తేనె తుట్టెను ప్రభుత్వం కదిపింది అనుకోవాలి. ప్రతీ నియోజకవర్గం కూడా మాకే జిల్లా కావాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. దాంతో ఒక్క లెక్కన ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి.

అనంతపురం జిల్లాలోని హిందూపురాన్ని కొత్త జిల్లాగా ప్రకటించమని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఆందోళన బాట పట్టారు. జిల్లా చేయకపోయారో ఊరుకోమని కూడా వైసీపీ పెద్దలను హెచ్చరించారు. ఇక రాయలసీమ‌ను చూస్తే పద్నాలుగు జిల్లాలుగా చేయమని అక్కడ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల విషయానికి వస్తే రెండు కాస్తా ఆరు అయినా కూడా ఎవరికీ సంతృప్తి లేదు. దాంతో మరిన్ని డిమాండ్లు వచ్చి పడుతున్నాయి.

ఇంకో వైపు కొందరు నేతల పేరు మీద జిల్లాలను ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లా విషయంలో ప్రభుత్వం కూడా సరికొత్త ఆలోచనలు చేస్తోంది అంటున్నారు. అదెలా అంటే ప్రభుత్వ ఆఫీసులను వికేంద్రీకరించడం ద్వారా చాలా వరకూ ఈ సమస్యలను అధిగమించగలమని భావిస్తోంది.

ఇంతకు ముందు అయితే జిల్లా కలెక్టర్ ఆఫీస్ తో పాటు ఎస్పీ ఆఫీస్, ముఖ్య‌మైన భవనాలు అన్నీ కూడా జిల్లా కేంద్రంలోనే ఉండేవి. అయితే ఇపుడు వైసీపీ సర్కార్ ఆ పద్ధతిని మార్చాలనుకుంటోంది. దీని వల్ల తమ ప్రాంతానికి ఏమి వచ్చిందని ఆలోచించేవారికి కూడా ఆనందం కలుగుతుంది, అభివృద్ధి కనిపిస్తుంది అని అంటున్నారు.

ఇక మీదట కలెక్టర్ ఆఫీస్ ని ఒక చోట ఉంచితే మరో చోట ఎస్పీ ఆఫీస్ ని ఉంచుతారు. అలాగే ఆ జిల్లాలో పారిశ్రామిక అవకాశాలు ఉన్న చోట ఆయా కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అనకాపల్లి జిల్లా విషయమే తీసుకుంటే అనకాపల్లిలో కేవలం కలెక్టర్ ఆఫీసే ఉండబోతోందిట.

తమకూ జిల్లా కావాలని ఆందోళన చేస్తున్న నర్శీపట్నంలో ఎస్పీ ఆఫీస్ పెడతారు. అదే విధంగా వ్యవసాయశాఖ, నీటిపారుదలశాఖ, ఉద్యానవనశాఖ, అటవీశాఖ సహా ఆ ప్రాంత ప్రత్యేకతలకు తగినట్లు నర్సీపట్నంలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకున్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉంది.

ఇలా వికేంద్రీకరించాలనుకొవడం వెనక మరో ఆలోచన కూడా ఉందని అంటున్నారు.  వేర్వేరు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా కార్యాలయాలకు భవనాల సమస్య ఏర్పడదన్న కోణం నుంచి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విధానం ద్వారా ప్రతీ నియోజక‌వర్గంలో ఒక జిల్లా ఆఫీస్ అయినా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి మూడు రాజధానులు మూడు ప్రాంతాలకు అనుగుణంగా పాలన వికేంద్రీకరణ  అన్న  వైసీపీ ప్రభుత్వం దాని కంటే ముందు జిల్లాల స్థాయిలలో వికేంద్రీకరణ మంత్రాన్ని ఎంచుకుంటోంది అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకూ ఫలిస్తుందో.
Tags:    
  • Jagan Sarkar 
  • andhra pradesh 
  • andhra pradesh government 
  • Andhra Pradesh Economy 
  • AP Sarkar 
  • Covid 19 
  • Ap new districts 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS