• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కూకట్‌ పల్లి పై మహమ్మారి...

కూకట్‌ పల్లి పై మహమ్మారి పంజా..వణికి పోతున్న నగర వాసులు!

By - Tupaki Desk
Update: 2020-07-03 23:30 GMT
తెలంగాణలో మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహమ్మారి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో 70నుండి 80శాతం వరకు ఒక్క  హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతుండటం తో నగరవాసుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇకపొతే సిటీలో కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధుల్లో 300లకుపైగా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 9 మంది మృతిచెందగా.. 170 మంది బాధితులు ఆస్పత్రులు, హోం  క్వారంటైన్ ‌లో ఉన్నారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కేసుల నమోదు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఈ మధ్య పెరిగాయి. జూన్ ‌లో వందకు పైగా నమోదయ్యాయి. జూలైలో ప్రతిరోజూ 25కి పైగా కేసులు నమోదవుతున్నాయి.

జీహెచ్ ‌ఎంసీ సిబ్బందికి , పోలీసులకి కూడా వైరస్ సోకడంతో అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణ విషయంలో భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పరిస్థితి దారుణంగా ఉంది. సిబ్బంది కొరత, వైరస్ నిర్దారణ పరీక్షల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో  ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. కూకట్‌ పల్లి ప్రాంతంలో 2 వేల మందికి ఓ ఏఎన్‌ ఎం ఉండాల్సి ఉండగా.. 60 వేల మందికి ముగ్గురు మాత్రమే ఉన్నారు. కూకట్‌ పల్లి పీహెచ్ ‌సీలో కనీసం 30మంది అధికారులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా... 13 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

మొదట్లో ధనికులు ఉండే కాలనీల్లో కేసుల నమోదు ప్రారంభమైంది. ఇతర దేశాల నుంచి రావడంతో ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని అధికారులు గుర్తించి ఆయా కాలనీలవాసులు నివారణ చర్యలు చేపట్టారు.  ముఖ్యంగా గేటెడ్‌ కమ్యూనిటీల్లో మొదటిసారి కేసు నమోదు కాగానే కాలనీలోకి రాకపోకలను కఠినతరం చేశారు. కాలనీవాసులందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించుకొని అప్రమత్తమయ్యారు. అయితే , లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన తరువాత బస్తీల్లో కేసులు పెరుగుతున్నాయి. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మహమ్మారి రక్షణ చర్యలు పాటించడంపై దృష్టి సారించకపోవడంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో శనివారం నాటికి మొత్తం 90 మహమ్మారి పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. గాజులరామారం సర్కిల్‌ పరిధిలో 58 మహమ్మారి పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఇద్దరు మృతి చెందారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 256 మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 10 మంది మృతి చెందగా, 108 మంది రికవరీ అయ్యారు. 100 మందికి పాజిటివ్‌ వచ్చినప్పటికీ లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్లో  ఉన్నారు. చింతల్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వారితోపాటు గాజులరామారంలో   పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

మూసాపేట సర్కిల్‌ లోని కేపీహెచ్ ‌బీ, అల్లాపూర్‌, మూసాపేట డివిజన్ల పరిధుల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. బాలాజీనగర్‌, ఫతేనగర్‌ ప్రాంతాల్లో ఇప్పుడే కేసుల నమోదు ప్రారంభమైంది.  కూకట్ ‌పల్లి సర్కిల్‌ లోని ఆల్విన్‌ కాలనీ, పాతబోయిన్ ‌పల్లి, వివేకానందనగర్‌ కాలనీ, బాలానగర్‌ డివిజన్ల పరిధుల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. హైదర్ ‌నగర్‌, కూకట్‌ పల్లి డివిజన్లలో ఐదు కేసులు నమోదుకాగా మిగతా డివిజన్లలో పదుల సంఖ్యలో ఉన్నాయి.
Tags:    
  • Kcr 
  • Ktr 
  • Hyderabad 
  • Telangana 
  • Telangana Cm 
  • Dangerous Disease In Hyderabad 
  • Dangerous Disease In Telangana 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS