• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లాక్ డౌన్ పొడిగిస్తూ...

లాక్ డౌన్ పొడిగిస్తూ కేసీఆర్ సర్కారు జీవో విడుదల

By - Tupaki Desk
Update: 2020-07-01 03:30 GMT
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద చర్చ నడుస్తోంది. హైదరాబాద్ మహా నగరంలో భారీ ఎత్తున పాజిటివ్ కేసులు రోజూ వందల సంఖ్యలో వస్తున్న వేళ.. పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. కేసుల పెరుగుదలకు చెక్ చెప్పేందుకు వీలుగా సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారని.. హైదరాబాద్ మొత్తాన్ని షట్ డౌన్ చేస్తారన్న ప్రచారం పెరుగుతోంది.

ఇలాంటివేళలో తెలంగాణ రాష్ట్ర సర్కారు తాజాగా ఒక జీవోను జారీ చేసింది. ఇందులో కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను పొడిగిస్తూ జీవో జారీ చేశారు. కేంద్ర హోం శాఖ రూల్స్ ప్రకారం.. కంటైంన్ మెంట్ జోన్ల లో జులై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంతకం చేశారు.డిజాస్టర్ మేనేజ్ మెంట్యాక్ట్ 2005 ప్రకారం ఈ జీవోను జారీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

అయితే.. ఈ జీవోలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అని పేర్కొన్నారు తప్పించి.. మిగిలినవేమీ ఉండవని స్పష్టం చేయటం గమనార్హం. ఆ సమయాల్లో మాత్రం అత్యవసరం అయితే తప్పించి బయటకు రాకూడదని స్పష్టం చేశారు. మందులు షాపులు తప్పించి మిగిలినవేమీ రాత్రి తొమ్మిదిన్నర తర్వాత తెరిచి ఉంచ కూడదు. జీవో వచ్చే వరకూ కూడా.. గ్రేటర్ పరిధి లో పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారని.. కేవలం రెండు.. మూడు గంటలు మాత్రమే నిత్యవసర వస్తువుల్ని కొనుక్కునేందుకు అనుమతులు ఇస్తారన్న ప్రచారం సాగింది. అందుకు భిన్నంగా సంపూర్ణ లాక్ డౌన్ కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకుండా.. గడిచిన కొంత కాలంగా జారీ చేస్తున్న రోటీన్ జీవోను జారీ చేశారు. మరి.. సంపూర్ణ లాక్ డౌన్ కు సంబంధించిన నిర్ణయాన్ని మంత్రి వర్గ సమావేశం ఫైనల్ చేస్తారా? అన్నదిప్పుడు సస్పెన్స్  గా మారింది. 
Tags:    
  • Kcr 
  • Ktr 
  • Hyderabad 
  • Telangana 
  • Telangana Cm 
  • Dangerous Disease In Hyderabad 
  • Dangerous Disease In Telangana 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

Copyright @2026

Powered by Blink CMS