• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నమస్తే తెలంగాణలో కొత్త...

నమస్తే తెలంగాణలో కొత్త కలకలం.. పలువురు స్వీయ క్వారంటైన్ కు

By - Tupaki Desk
Update: 2020-06-15 04:45 GMT
అక్కడెక్కడో అల్లంత దూరాన ఉన్న వూహాన్ లో మాయదారి మహమ్మారి వచ్చింది చూశాం. జనవరి మొదట్లో సింగిల్ కాలం వార్తలు మాత్రమే అచ్చేసిన మీడియా.. ఆ వార్తలే రానున్న రోజుల్లో తమకు గుదిబండగా మారతాయని చాలా మంది అసలు ఊహించింది లేదు. కేవలం ఆర్నెల్ల వ్యవధిలో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఇంటి పక్కకు.. ఆఫీసులో పక్క సీటు వరకూ వచ్చేసిన ఈ మహమ్మారి కారణంగా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అస్సలు అర్థం కావట్లేదు.

తెలంగాణ రాష్ట్ర అధికారపక్షానికి చెందిన సొంత మీడియా సంస్థలో తాజాగా మాయదారి రోగం సంచలనంగా మారింది. నమస్తే తెలంగాణ దినపత్రికలో కీలక స్థానానికి చెందిన సీనియర్ పాత్రికేయుడికి పాజిటివ్ గా తేలింది. దీంతో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పని చేసే వారికి షాక్ తగిలినట్లుగా మారింది. ఇక.. ఇదే పత్రికకు ఎడిటర్ తో పాటు.. పలువురు కీలక జర్నలిస్టులు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు చెబుతున్నారు.

పాజిటివ్ వచ్చిన వ్యక్తి అల్లాటప్ప వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడైన ఆయన్ను మహమ్మారి పట్టేయటంతో.. ఆయనతో తరచూ సమావేశమయ్యే వారంతా ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. శనివారం సాయంత్రం కూడా సదరు సీనియర్ పాత్రికేయుడు నమస్తే తెలంగాణ ఆఫీసుకు రావటమే కాదు..కీలక సమావేశాల్లో పాలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ఆ పత్రికకు చెందిన ప్రముఖ జర్నలిస్టుల్లో ముఖ్యులు హోం క్వారంటైన్ కు వెళ్లినట్లుగా సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. నమస్తే తెలంగాణ మీడియా సంస్థకు చెందిన ప్రముఖుడు ఒకరికి పాజిటివ్  తేలిన వేళలోనే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలన్న అంశంపై సుదీర్ఘ భేటీని నిర్వహించటం గమనార్హం.
Tags:    
  • Kcr 
  • Ktr 
  • Hyderabad 
  • Telangana 
  • Telangana Cm 
  • Dangerous Disease In Hyderabad 
  • Dangerous Disease In Telangana 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS